టాలీవుడ్ జక్కన్న రాజమౌళి విజువల్ ఎఫెక్ట్స్ సినిమా చేయాలి అంటే ఎంతగా ప్రాణం పెట్టి తీస్తాడో… చేస్తాడో అందరికీ తెలిసిందే.హాలీవుడ్ సినిమా ల రేంజ్ లో గ్రాఫిక్స్ ని వాడే ఒకే ఒక్క ఇండియన్ ఫిలిం మేకర్ రాజమౌళి అనడం లో ఎలాంటి సందేహం లేదు.
ఆయన యొక్క బాహుబలి మరియు తాజాగా విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అనడం లో ఏమాత్రం సందేహం లేదు.టాలీవుడ్ జక్కన్న రాజమౌళి స్థాయిలో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఏ ఒక్కరు కూడా గ్రాఫిక్స్ ని అంతగా వాడలేరు అనేది చాలా మంది అభిప్రాయం.
కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం ను వారిలో కొందరు మార్చుకునే అవకాశం కనిపిస్తుంది.ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది.
సంక్రాంతి కానుకగా రాబోతున్న ఆదిపురుష్ సినిమా టీజర్ ని నిన్న విడుదల చేయడం జరిగింది.
టీజర్ విడుదల తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ ఒక అద్భుతమైన విజువల్ వండర్ గా ఉండబోతుందని అనిపిస్తుంది.
హాలీవుడ్ సినిమా లకు ఏమాత్రం తగ్గకుండా ఆదిపురుష్ సినిమా ను దర్శకుడు ఓమ్ రౌత్ చేసినట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.ఇలాంటి అద్భుతమైన విజువల్ వండర్ ని కేవలం రాజమౌళి మాత్రమే చేయగలరని ఇన్నాళ్లు ఆయన అభిమానులు మరియు ప్రేక్షకులు భావించారు.
కానీ ఆయన స్థాయిలోనే ఇలాంటి అద్భుతమైన సినిమాలు చేయగల సత్తా ఉన్న దర్శకుడు ఉన్నాడని ఈ సినిమా టీజర్ చూస్తుంటే అర్థం అవుతుంది.ప్రభాస్ ని వేరే లెవల్లో చూపించిన దర్శకుడు ఓం రౌత్ ముందు ముందు టాలీవుడ్ జక్కన్న రాజమౌళి యొక్క రికార్డులు బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రాజమౌళి స్థాయిలోనే ఓం రౌత్ కోసం ఔమ్ రౌత్ దర్శకుడు కష్టపడ్డాడని చెప్పాలి.ఆదిపురుష్ వచ్చే సంక్రాంతికి విడుదల అయ్యి వెయ్యి కోట్లు వసూళ్లు చేస్తే అప్పుడు దేశం మొత్తం కూడా ఓమ్ రౌత్ గొప్పతనంను కీర్తించే అవకాశం ఉంది.