అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా.. సదా కామెంట్స్ వైరల్..?

తెలుగులో తక్కువ సంఖ్యలో సినిమాలు చేసినా హీరోయిన్ సదాకు ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది.జయం, అపరిచితుడు, నాగ, వీరభద్ర మరికొన్ని సినిమాలు సదాకు నటిగా మంచిపేరు తెచ్చిపెట్టాయి.

 Actress Sadha Interesting Comments About Marriage, Actress Sadha, Goes Viral ,-TeluguStop.com

తాజాగా ఒక షోకు హాజరైన సదా తనది రత్నగిరి అని తనకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్, డ్యాన్సింగ్ అంటే ఇష్టమని సదా చెప్పుకొచ్చారు.తాను పది, ఇంటర్ లో 92 శాతం మార్కులు వచ్చాయని సదా పేర్కొన్నారు.

తనకు బ్లడ్ అంటే భయం కావడంతో ఇంజనీరింగ్ లో చేరాలని అనుకున్నానని సదా తెలిపారు.ఇంజనీరింగ్ క్లాసులు ఆలస్యం కావడంతో తల్లి అనుమతితో యాక్టింగ్ స్కూల్ లో చేరానని సదా వెల్లడించారు.

చండాలంగా ఉన్న ఫోటోలను చూసి తేజ గారు సెలెక్ట్ చేశారని తేజ నన్ను అడిషన్స్ చేయకుండానే హీరోయిన్ పాత్రకు ఎంపిక చేశారని తేజ విజన్ గ్రేట్ అని సదా చెప్పుకొచ్చారు.వెళ్లగయ్యా వెళ్లు డైలాగ్ కు టేక్స్ ఎక్కువగా తీసుకున్నానని సదా చెప్పారు.

Telugu Actress Sadha, Jayam, Naga, Sadha, Tollywood-Movie

జయం తర్వాత రెండు మూడు నెలలు తనకు ఆఫర్లు రాలేదని తర్వాత నాగ మూవీలో ఛాన్స్ వచ్చిందని సదా పేర్కొన్నారు.తాను వీగన్ అని పాలు కూడా తాగనని సదా పేర్కొన్నారు.జంతువుల నుంచి ఉత్పత్తులు కాకుండా అన్నీ తింటానని సదా వెల్లడించారు.పెళ్లి చేసుకోకవడానికి వీగన్ అయిన మనిషి దొరకాలని తాను కోరుకుంటున్నానని సదా చెప్పుకొచ్చారు.అలా ఉంటే తనకు నచ్చవచ్చని ఆమె తెలిపారు.

Telugu Actress Sadha, Jayam, Naga, Sadha, Tollywood-Movie

అమ్మ నాన్న ముంబైలో ఉంటారని వాళ్లది లవ్ మ్యారేజ్ అని చెప్పారని సదా వెల్లడించారు.2015 సంవత్సరంలో అమ్మకు క్యాన్సర్ అని తెలియడంతో కొన్ని సినిమాలకు తాను అంగీకరించలేదని సదా చెప్పుకొచ్చారు.అమ్మ బర్త్ డే రోజు ఈ విషయం తెలిసిందని సదా పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube