పెళ్లి పీటలెక్కిన బాలీవుడ్ విలన్ కబీర్ సింగ్.. నెట్టింట ఫొటోస్ వైరల్?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.ఇప్పటికే టాలీవుడ్ లో బాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కిన విషయం మనందరికీ తెలిసిందే.

 Actor Kabir Duhan Singh Ties The Knot With Seema Chahal Watch Wedding Photos, Ka-TeluguStop.com

ఇది ఇలా ఉంటే తాజాగా టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిష్ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న కబీర్ సింగ్ ఒక ఇంటి వాడయ్యాడు.హర్యానాకు చెందిన సీమ చాహల్‌ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని కలిసి ఏడడుగులు నడిచాడు.

తాజాగా ఫరీదాబాద్‌ లోని ఒక లగ్జరీ హోటల్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

ఇరు కుటుంబాలతో పాటు వధూవరుల సన్నిహితులు, స్నేహితులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.

అలాగే పలువురు సెలబ్రిటీలు కూడా ఈ వేడుకకు హాజరైనట్టు తెలుస్తోంది.కొత్త దంపతులను ఆశీర్వదించారు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో కబీర్‌- సీమ చాహల్‌ల పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు, పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇకపోతే కబీర్ సింగ్ విషయానికి వస్తే.హర్యానా రాష్ట్రానికి చెందిన కబీర్‌ సింగ్ గోపీచంద్‌ హీరోగా నటించిన జిల్‌ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు.

Telugu Seema Chahal-Movie

మొదటి సినిమాలోనే స్టైలిష్‌ విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత తెలుగులో కిక్‌ 2, డిక్టేటర్‌, వేదాళం,స్పీడున్నోడు, సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌, సుప్రీమ్‌, జక్కన్న, సాక్ష్యం, శాకినీ డాకినీ, హంట్‌, కబ్జా లాంటి ఎన్నో సినిమాలలో విలన్ గా నటించి మెప్పించాడు.కాగా ఇటీవల స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమాలో కూడా అసుర రాజు పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇకపోతే కబీర్‌ సింగ్ భార్య సీమా చాహల్‌ విషయానికొస్తే.

ఆమె మ్యాథ్స్‌ టీచర్‌ అని తెలుస్తోంది.కాగా సీమాతో పెళ్లి అనంతరం మాట్లాడిన కబీర్‌ సింగ్‌.

జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినందుకు సంతోషంగా ఉంది.ఆ భగవంతుడు, అభిమానులు నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు.

నా సతీమణి సీమకు కూడా మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను.ఆమె జీవితంలో నేను బెస్ట్‌ హీరోగా ఉండాలనుకుంటున్నాను.

నేను సినిమా పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను.ఇప్పుడదే నిజమైంది.

సీమాను కలిసిన మొదటి క్షణంలోనే ఆమే నా అర్ధాంగి అనిపించింది.నన్ను, నా ఫ్యామిలీని బాగా అర్థం చేసుకోగలదన్న నమ్మకం అని చెప్పుకొచ్చారు కబీర్ సింగ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube