తెలుగు సినీ ప్రేక్షకులకు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి( Kollywood Hero Vijay Sethupathi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కోలీవుడ్ స్టార్ హీరో అయినప్పటికి టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
విజయ్ సేతుపతి పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ఉప్పెన.మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించడంతో పాటు ఈ సినిమాతో మరింత చేరువ అయ్యారు విజయ్ సేతుపతి.
ప్రస్తుతం విజయ్ సేతుపతి టాలీవుడ్, బాలీవుడ్ కోలీవుడ్ అని బాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.
ప్రస్తుతం తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్న సేతుపతి అడపాదడపా తెలుగు, హిందీ సినిమాలలో కూడా మెరుస్తున్నారు.ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ అన్ని ఇండస్ట్రీలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ని ఏర్పరచుకున్నాడు.ఇక ఉప్పెన సినిమా తర్వాత విడుదలైన మాస్టర్,విక్రమ్( Vikram ) లాంటి సినిమాలు విజయ్ సేతుపతికి మరింత గుర్తింపును తెచ్చిపెట్టాయి.
ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ సేతుపతి బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్( Jawaan ) సినిమాలో నటిస్తున్నారు.ఇకపోతే ఈయనకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.
సోషల్ మీడియా లో చాలా తక్కువ యాక్టివ్ గా ఉంటూ కేవలం తన సినిమా అప్డేట్స్ మాత్రమే పంచుకుంటూ ఉంటారు విజయ్.విజయ్ సేతుపతికి ఇంస్టాగ్రామ్( Vijay Sethupathi Instagram ) లో 7.3 మిలియన్ అంటే 73 లక్షల పైగా ఫాలోవర్స్ ఉన్నారు.అయితే అతనికి అంత మంది ఫాలోవర్స్ ఉన్నప్పటికీ విజయ్ మాత్రం కేవలం ఏడుగురికి ఫాలో అవుతున్నారు.
మరి ఆ ఏడుగురు ఎవరు అన్న విషయానికి వస్తే.లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త డైరెక్టర్ విఘ్నేష్ శివన్, తమిళ్ డైరెక్టర్ మిస్కిన్, హీరోయిన్ అంజలి, కోలీవుడ్ నటుడు రమేష్ తిలక్, కోలీవుడ్ గేయ రచయిత కార్తీక్ నేత, డైరెక్టర్ రంజిత్ జయకోడి, తర్వాత తన సొంత నిర్మాణ సంస్థ విజయ్ సేతుపతి ప్రొడక్షన్స్ ఖాతాలను మాత్రమే ఫాలో అవుతున్నారు.