అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ ఘటన 14 ఏళ్ల కుర్రాడి ప్రాణాలు పోయేలా చేసింది.ఆన్లైన్ లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కొనుగోలు ప్రకటన చూసిన మార్టిన్ హిక్సన్ అందులోని అడ్రస్ ని సంప్రదించాడు.
వారు మార్టిన్ ని ఓ ప్రదేశానికి రావాలని సూచించారు.ఆ ప్రదేశానికి వెళ్ళిన మార్టిన్ కి…
ఇద్దరు తన ఈడు వాళ్ళు కనిపించారు.
అయితే వారిని కలిసి మాట్లాడుతూ బేరం చేస్తుండగ, వారిలో ఒకడు మార్టిన్ గుండెలకి తుపాకి గురిపెట్టి అతడిని దోచుకోవాలని అనుకున్నారు.అయితే ఊహించని రీతిలో మార్టిన్ సైతం తన వద్ద ఉన్న గన్ తీసి వారిపై కాల్పులు జరిపాడు.
ఆ కుర్రాళ్లు కూడా తనపై కాల్పులు జరపడం ఇలా కాలుపు జరగడంతో వారిలో ఓ కుర్రాడికి బలమైన గాయం అయ్యింది.ఈ ఘటనలో మార్టిన్ గుండెలోకి కూడా ఓ తూటా దిగడంతో మార్టిన్ అక్కడికక్కడే మరణించాడు.
అయితే గాయం కోసం హాస్పటల్ లో చేరిన మరో వ్యక్తి ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.