రాజస్థాన్ , బెంగళూర్ ఈ రెండు జట్లు ఈ సీజన్ ఇప్పటి వరకు ఆడిన తమ మూడు ఐపీఎల్ మ్యాచ్ లు ఆడి పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్నాయి.రాజస్థాన్ అన్ని మ్యాచ్ లలో బాగా ప్రదర్శన చేసిన చివరి దాకా వచ్చిఓటమి పాలయ్యారు.
ఇకపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ఒక్క మ్యాచ్ లో మినహా మిగతా రెండు మ్యాచ్ లలో దారుణమైన ప్రదర్శన చేసింది , అసలు ఆ జట్టు లో ఏ ఒక్క ఆటగాడు కూడా ఫామ్ లో లేక బాటింగ్ లో బౌలింగ్ లో ఇబ్బందిపడుతుంది.ఇరు జట్లు ఈ మ్యాచ్ లో గెలవలన్న లక్ష్యం తో బరిలోకి దిగనున్నారు.
1)ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో రికార్డులు ఎలా ఉన్నాయి
ఇప్పటివరకు రాజస్థాన్ కి బెంగళూర్ కి మధ్య 18 మ్యాచ్ లు జరగగా బెంగళూర్ 9 మ్యాచ్ లలో గెలవగా రాజస్థాన్ 8 మ్యాచ్ లలో గెలిచింది.ఒక్క మ్యాచ్ లో ఫలితం తేలలేదు.

2)పిచ్ ఎలా ఉండబోతుంది
రాజస్థాన్ లోని జైపూర్ లో మ్యాచ్ జరగనుంది , ఇక్కడ పిచ్ స్పిన్నర్ లకి బాగా కలిసొస్తుంది , ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సగటు పరుగులు 170
3)రాజస్థాన్ జట్టు ఎలా ఉండబోతుంది
రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్ లో ఒక్కో మ్యాచ్ లో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే రాణిస్తున్నారు , సమిష్టిగా బ్యాటింగ్ లో రాణిస్తే ఆ జట్టు భారీ స్కోర్ చేసే వీలుంటుంది.ఇకపోతే బౌలింగ్ లో జోఫ్రా ఆర్చే మినహా అందరూ పేలవంగా బౌలింగ్ చేస్తున్నారు , ముఖ్యంగా జయదేవ్ ఉనద్కత్ పేలవంగా బౌలింగ్ చేస్తున్నాడు.అతడు ఈ మ్యాచ్ లో ఆడతాడో లేదో వేచి చూడాలి.

రాజస్థాన్ రాయల్స్ జట్టు ( PROBABLE XI ) – అజింక్య రహానే , స్టీవ్ స్మిత్ , జొస్ బట్లర్ , సంజు శాంసన్, బెన్ స్టోక్స్ ,రాహుల్ త్రిపాఠి , జోఫ్రా ఆర్చే ,జయదేవ్ ఉనాధ్కట్ , వరుణ్ ఆరోన్ ,గౌతమ్ శ్రేయస్ గోపాల్
4)రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ఎలా ఉండబోతుంది
బెంగళూర్ జట్టు అసలు ఆ జట్టు లో బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ కనీస ప్రదర్శన కూడా చేయట్లే , సన్ రైజర్స్ తో ఆడిన గత మ్యాచ్ లో అసలు జట్టులో ఒకరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు , బ్యాటింగ్ లో విదేశీ ఆటగాళ్లు అయిన మెయిన్ అలీ , హెట్ మేయర్ ఈ మ్యాచ్ లో అడకపోవచ్చు , అతని స్థానం లో మార్కస్ స్టయినిస్ ఆడే అవకాశాలు ఉన్నాయి.ఈ మ్యాచ్ లో కోహ్లీ , డివిలియర్స్ రాణిస్తే తప్ప విజయం సాధించే పరిస్థితి లో లేదు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ( PROBABLE XI ) : విరాట్ కోహ్లీ , పార్థివ్ పటేల్ , మార్కస్ స్టయినిస్ , ఏ బి డివిలియర్స్ , కోలిన్ డి గ్రాండి హోమ్ , శివమ్ ధూబె , చాహల్ , ప్రయస్ బర్మన్ , ఉమేష్ యాదవ్ , టీమ్ సౌథీ , నవదీప్ సైనీ.