ఖాకీ డ్రస్ వదిలేసి పక్కా పొలిటీషియన్ అవతారం ఎత్తిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకువస్తారని, ఆయన నీటి నిజాయితీ , ముక్కు సూటితనం ఏపీ ప్రజలకి ఓ సరికొత్త నాయకుడిని చూపిస్తుందని అనుకున్న తరుణంలో ఆయన పార్టీ పెడుతారని అందరూ సంతోషిస్తే అబ్బే అదేమీ లేదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలో చేరిపోయారు.సరే వెళ్తే వెళ్ళారు.
కానీ వెళ్లి వెళ్ళగానే ఆయనపై ఉన్న ఓ బ్రాండ్ ఇమేజ్ ని చెరిపేసుకుని ఓ పక్కా పొలిటీషియన్ గా మారిపోయారు.తాజాగా ఓ ఘటనతో నవ్వుల పాలయ్యారు.
ఆ వివరాలలోకి వెళ్తే.

తాజాగా ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడిన జనసేన ఎంపీ అభ్యర్ధి జేడీ లక్ష్మీ నారాయణ, ఏపీ ప్రజలకి ఊహించని షాక్ ఇచ్చారు, అయితే ఈ షాక్ ప్రజలకంటే కూడా అక్కడే ఉన్న విలేఖరులకి తగిలి దిమ్మతిరిగి బొమ్మ కనిపించిందట.ఇంతకీ ఏమిటా షాక్ అంటే జనసేన ఎవ్వరూ ఊహించని స్థాయిలో విజయం సాధించి అధికారం కూడా చేపట్టడం ఖాయమని తేల్చేశారు జేడీ.సరే ఆ మాత్రం ధీమా, మీడియా ముందు అలా చెప్పుకోక పొతే ఎలా సరే చెప్పుకోవచ్చు మరో అడుగు ముందుకు వేసి.

వచ్చే ఎన్నికల్లో జనసేన ఎన్ని సీట్లు సాధిస్తుందన్న విషయాన్ని కూడా వెల్లడించేసి మీడియా మిత్రులకు మైండ్ బ్లాక్ చేశారు.మరి మాజీ జేడీ లెక్కల్లో వీకో ఏమో గాని ఆయన చెప్పిన విషయాలు విని నవ్వు ఆపుకోలేక మీడియా మిత్రులు తెగ ఇబ్బంది పడ్డారట.175 అసెంబ్లీ సీట్లకి గాను జనసేన పోటీ చేసేది కేవలం లెక్కలు పోను 120 సీట్లలో మాత్రమే.అయితే జనసేన ఏకంగా ఆయా స్థానాలలో 88 చోట్ల విజయం సాధిస్తుందట.

అక్కడితో ఆగకుండా జేడీ లోక్ సభ సీట్ల గెలుపుపై కూడా తన అభిప్రాయం చెప్పారు దాంతో పరువు పోగొట్టుకున్నారు.మొత్తం 25 ఎంపీ సీట్లలో 15 నుంచి 20 ఎంపీ సీట్ల దాకా జనసేన గెలుస్తుందని ఆయన అన్నారు.కానీ అయినా 25 ఎంపీ సీట్లలో 3 సీట్లను బీఎస్పీకి ,సీపీఐ – సీపీఎంలకు చెరో రెండు ఎంపీ సీట్లను కేటాయించిన జనసేన మొత్తంగా మిత్ర పక్షాలకి ఇచ్చింది 7.ఇవి తీసేస్తే జనసేన పోటీ చేస్తున్న ఎంపీ సీట్లు 18 మాత్రమే.మరి ఆ పార్టీ గెలిచే సీట్లు 15 అంటే బాగుండేదేమో 18 చోట్ల పోటీ చేస్తూ 20 స్థానాలలో గెలుస్తామని చెప్పడం సంచలనం అయ్యింది.జేడీ గారు రాజకీయాల్లో రాగానే బలేగా మారిపోయారు అంటూ సెటైర్స్ వేస్తున్నారట.