సర్జరీకి సిద్ధమైన బుట్ట బొమ్మ.. ఆ పార్ట్ కు సర్జరీ చేయించనున్న పూజా హెగ్డే?

సినిమా ఇండస్ట్రీ అంటే ఒక రంగుల ప్రపంచం .ఈ రంగుల ప్రపంచంలో ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని ఆరాటపడుతుంటారు.

 A Basket Doll Ready For Surgery Pooja Hegde Will Undergo Surgery For That Part S-TeluguStop.com

ముఖ్యంగా హీరోయిన్లు అందంగా ఉంటేనే అవకాశాలు వస్తాయి.అందువల్ల వారు అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

కొంతమంది ఆ సర్జరీలు చేయించుకొని మరింత అందంగా తయారైతే మరి కొంతమంది మాత్రం సర్జరీ ఫెయిల్యూర్ అవ్వటం వల్ల అందవిహీనంగా తయారవుతుంటారు.అయినా కూడా హీరోయిన్లు సర్జరీలు చేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇక ఇండస్ట్రీ వర్గాలనుండి అందుతున్న సమాచారం ప్రకారం సౌత్ ఇండస్ట్రీలో మరొక స్టార్ హీరోయిన్ సర్జరీ చేయించుకోవడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం.

ఆ హీరోయిన్ మరెవరో కాదు అందాల నటి పూజా హెగ్డే .తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకొని స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన పూజా హెగ్డే ప్రస్తుతం సౌత్,నార్త్ ఇండస్ట్రీలలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.దీంతో ఈ అమ్మడు పాన్ ఇండియ హీరోయిన్ మారిపోయింది.

అయితే ఈ మధ్యకాలంలో పూజా హెగ్డే నటించిన సినిమాలు అన్ని వరుసగా ప్లాప్ అవ్వడంతో ఈ అమ్మడిని ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.అయినా కూడా సౌత్ నార్త్ ఇండస్ట్రీలలో వరుస సినిమాలలో అవకాశాలు అందుకొని బిజీగా ఉంటుంది.

Telugu Iron Leg Troll, Mahesh Babu, Pooja Hegde, Surgery, Nose, Tollywood-Movie

అయితే తన అందంతో అందరినీ ఆకట్టుకున్న పూజా హెగ్డే ముక్కు గురించి ఇప్పుడు విమర్శలు రావడంతో ఆమె సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.పూజా హెగ్డే సన్నిహితులతో పాటు మరి కొంతమంది ఆమె మొహంలో ముక్కు సరిగా లేదని చెప్పటంతో ఆమె సర్జరీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.పూజ హెగ్డే మొహంలో తన ముక్కు మైనస్ అంటూ సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ చేస్తున్నారు .అందువల్ల పూజ సర్జరీకి సిద్ధమైనట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే పూజ ఈ విషయంపై స్పందించాల్సి ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube