స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) అఖండ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అఖండ సినిమా కలెక్షన్ల విషయంలో సైతం బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.
కరోనా సమయంలో తక్కువ టికెట్ రేట్లతో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.అయితే అఖండ2( Akhanda 2 ) బాక్సాఫీస్ టార్గెట్ మాత్రం భారీ స్థాయిలో ఉండబోతుందని తెలుస్తోంది.
అఖండ సినిమా అప్పట్లో 70 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించగా అఖండ2 సినిమా మాత్రం ఏకంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అఖండ2 సినిమాలో ప్రగ్యా జైస్వాల్ ఒక హీరోయిన్ గా నటిస్తుండగా సంయుక్త మీనన్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.డాకు మహారాజ్( Daaku Maharaaj ) సినిమాతో బాలయ్య ఇటీవల భారీ సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే.

డాకు మహారాజ్ మూవీ యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చడంతో పాటు కలెక్షన్ల విషయంలో సైతం అదరగొట్టింది.అయితే బాలయ్య ఫ్యాన్స్ కోరుకున్న 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ల మార్కును మాత్రం ఈ సినిమా అందుకోలేకపోయింది.సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి గట్టి పోటీ ఎదురవ్వడం ఈ సినిమాకు మైనస్ అయిందని చెప్పవచ్చు.

డాకు మహారాజ్ తో వరుసగా బాలయ్య 4 హిట్లను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.అఖండ2 మూవీ 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.అఖండ2 శాటిలైట్, డిజిటల్ హక్కుల కోసం గట్టి పోటీ నెలకొంది.అఖండ2 కలెక్షన్ల పరంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.ఈ ఏడాది సెప్టెంబర్ నెల 25వ తేదీన అఖండ2 రిలీజ్ కానుంది.అఖండ2 మూవీ సక్సెస్ దర్శకుడు బోయపాటి శ్రీనుకు( Boyapati Srinu ) కూడా కీలకం అనే సంగతి తెలిసిందే.