నాచురల్ స్టార్ నాని( Natural Star Nani ) లాంటి స్టార్ హీరో ఈ మధ్య చేస్తున్న సినిమాలతో వరుస విజయాలను అందుకుంటున్నాడు.ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన నాని తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నాడు.
ఇక గౌతమ్ తిన్ననూరి( Gowtam Tinnanuri ) డైరెక్షన్ లో నాని చేసిన ‘జెర్సీ ‘ సినిమా( Jersey Movie ) భారీ విజయాన్ని అందుకుంది.అయితే వీళ్ళిద్దరి కాంబోలో మరొక సినిమా రావాల్సిందే.
కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా అయితే పట్టాలెక్కలేదు.

కారణం ఏదైనా కూడా నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు.తద్వారా ఆయన మిగతా దర్శకులతో పెద్దగా కలవడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఒకవేళ గౌతమ్ తిన్ననూరితో సినిమా చేసుంటే అదొక మాస్ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిది అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రావాల్సిన సినిమా ఎందుకు ఆగిపోయింది అనేదానికి సరైన సమాధానాలు అయితే లేవు.ఇక మొత్తానికైతే నాని తో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో( Vijay Devarakonda ) సినిమా చేస్తున్న గౌతమ్ తిన్ననూరి తన తదుపరి సినిమాని వేరే స్టార్ హీరోతో చేసినప్పటికి నానితో ఒక మూవీ మాత్రం బ్యాలెన్స్ అయితే ఉందట.

ఇక అతని కోసమే రాసుకున్న కథలో ఆయన తప్ప వేరే వాళ్ళను ఊహించుకోలేమనే ఉద్దేశ్యంతో గౌతమ్ తిన్ననూరి ఆ కథను పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది…మరి ఏది ఏమైన కూడా వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తే జెర్సీ ని మించి ఉండాలి కానీ దానికంటే తగ్గకూడదు అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు…చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది…