విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్ డమ్ సినిమాకు( Kingdom Movie ) సంబంధించిన టీజర్ ని గత కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు.మొత్తానికైతే ఈ సినిమాని చూస్తుంటే విజయ్ దేవరకొండ పెద్ద సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
దాదాపు 100 కోట్ల బడ్జెట్ తెరకెక్కుతున్న ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులందరిని ఆకట్టుకోవడానికి పాన్ ఇండియా సినిమాగా బరిలోకి దిగుతుంది.ఇక ఎన్టీఆర్ వాయిస్ ఓవర్( NTR Voiceover ) తో స్టార్ట్ అయిన ఈ టీజర్ ప్రేక్షకులందరినీ మెప్పిస్తూ ముందుకు సాగుతుంది.
ఎన్టీఆర్ వాయిస్ లోని బేస్ ఈ టీజర్ ను అమాంతం పైకి లేపేసిందనే చెప్పాలి.

ముఖ్యంగా విజయ్ దేవరకొండ లుక్ అయితే అద్భుతంగా కుదిరింది.ఎన్టీఆర్ చెప్తున్నా ఒక్కో డైలాగ్ వింటుంటే చూసే ప్రతి వారికి రోమాలు నిక్క పొడుస్తున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని ఈ మూవీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి( Director Gowtam Tinnanuri ) హీరో విజయ్ దేవరకొండ భారీ కాన్ఫిడెంట్ తో ఉన్నారు.
మరి రెండు పార్ట్ లుగా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది తద్వారా విజయ్ దేవరకొండ టాప్ హీరోగా మారబోతున్నాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

మరి మొత్తానికైతే ఈ సినిమాతో తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఇప్పటికే ఆయన చేస్తున్న వరుస సినిమాలు ప్లాప్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తేనే ఆయన మార్కెట్ అనేది పెరుగుతుంది.లేకపోతే మాత్రం భారీగా డౌన్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయి…
.