కాలేయంలో అధిక మొత్తంలో కొవ్వు పేరుకుపోవడం(Fat accumulation) వల్ల తలెత్తే సమస్యే ఫ్యాటీ లివర్(Fatty liver).ఇటీవల రోజుల్లో ఎంతో మంది ఫ్యాటీ లివర్ ను అనుభవిస్తున్నారు.ఈ సమస్యను స్టీటోసిస్ అని కూడా పిలుస్తారు.ఇది రెండు రకాలుగా ఉంటుంది.ఒకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్(alcoholic fatty liver).మరొకటి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్( Non-alcoholic fatty liver).
మద్యం అధికంగా తాగడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు.మద్యం తాగకపోయినా, ఇతర కారణాల వల్ల అంటే ఆహారపు అలవాట్లు, డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్, అధిక బరువు వల్ల కొవ్వు పేరుకుపోవడాన్ని నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు.
ఫ్యాటీ లివర్ ను తుది దశలోనే నియంత్రించడం చాలా ముఖ్యం.లేకుంటే లివర్ ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది.ఇక ఫ్యాటీ లివర్ ను ఎలా గుర్తించాలి? లక్షణాలేంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా కాలేయంలో కొవ్వు ఏర్పడినప్పుడు ప్రాథమిక దశల్లో లక్షణాలు స్పష్టంగా కనిపించవు.
అయితే కొంతమందికి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.అలసట, కుడి వైపు కడుపు పైభాగంలో స్వల్ప నొప్పి లేదా ఒత్తిడిగా అనిపించడం, ఉన్నట్లుండి శరీర బరువు పెరగడం లేదా తగ్గడం ఫ్యాటీ లివర్ ప్రాథమిక లక్షణాలు.

సమస్య తీవ్రంగా మారితే.కామెర్లు, ఆహారం తిన్న తర్వాత అసౌకర్యం, కాళ్లలో మరియు కడుపులో వాపు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి.ప్రాథమిక లక్షణాలు కనిపించినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.ఇక ఫ్యాటీ లివర్ నివారించేందుకు జీవనశైలిలో మార్పులు, ఆరోగ్యకరమైన అలవాట్లు మరియు సమయానికి వైద్య పర్యవేక్షణ ఎంతో ముఖ్యమని గుర్తుంచుకోండి.

ముఖ్యంగా కూరగాయలు, పండ్లు(Vegetables ,fruits), మరియు పోషకాల సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోండి. జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ (Junk food, packaged foods)మరియు తీపి పానీయాలను ఎవైడ్ చేయండి.తక్కువ కొవ్వు, అధికంగా ఫైబర్ కలిగిన ఆహారాలను ఎంపిక చేసుకోండి.బరువు నియంత్రణను ఉంచుకోండి.వాటర్ ఎక్కువగా తీసుకోండి.మద్యం అలవాటును వదులుకోండి.
తరచూ పెయిన్ కిల్లర్స్ వాడటం మానుకోండి.నిత్యం కనీసం అరగంట అయినా వ్యాయామం చేయండి.