వైరల్ వీడియో: ఎంతకు తెగించావురా.. కారు బ్యానెట్ పై మనిషి ఉన్నా కానీ..

సాధారణంగా భార్యాభర్తల మధ్య అనేక సంతోషం, బాధ ఇలా అనేక సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.ఈ క్రమంలో భర్త వేరొక అమ్మాయితో ఉండగా భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం, అలాగే భార్య తన ప్రియుడుతో ఉండగా భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిన సందర్భాలు మనం సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం.

 Viral Video: How Dare You.. Even Though There Is A Man On The Bonnet Of The Car,-TeluguStop.com

ఇందుకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.అయితే, తాజాగా ఒక వ్యక్తి తన భార్య వేరొక యువకుడితో (Wife with another young man)కారులో వెళ్తుండడం చూసి వారిని ఫాలో అయ్యాడు.

అలా ఫాలో అయ్యాక చివరికి ఏమైందంటే.

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా. ఉత్తరప్రదేశ్‌ లోని మొరాదాబాద్‌ పరిధి కట్ఘర్ కొత్వాలిలో(Uttar Pradesh, Moradabad, Katghar Kotwali) ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది.స్థానిక ప్రాంతానికి చెందిన సమీర్(sameer)అనే వ్యక్తి బైకుపై వెళ్తున్న క్రమంలో అతడికి తన భార్య మహిర్(Mahir) అనే వ్యక్తితో కలిసి కారులో వెళ్లడం చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు.

దీంతో వారిద్దర్నీ ఎలాగైనా పట్టుకోవాలని బైక్ తో వారిని ఫాలో అయ్యాడు.ఇది గమనించిన మహిర్ కూడా కారు వేగాన్ని పెంచాడు.సమీర్ అతని అడ్డుకునేందుకు ప్రయత్నం చేయగా.ఈ క్రమంలో కారు బలంగా తాకడంతో సమీర్ బైకు పైనుంచి ఎగిరి కార్ బానెట్‌పై పడ్డాడు.

అంతే కాకుండా అద్దంపై ఉన్న వైపర్‌ను పట్టుకొని అలాగే ఉండిపోయాడు.అయినా కానీ, మాహీర్ కారును అలానే డ్రైవ్ చేశాడు.

కారు బ్యానెట్ పై వ్యక్తిని లాక్కెళ్ళడం చూసి చుట్టుపక్కల ఉన్నవారు అందరూ కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఇది గమనించిన అక్కడి స్థానికులు వాహనదారులు వెంబడించి మరీ కారును ఆపేశారు.కారు ఆపిన తర్వాత బానెట్‌పై నుంచి కిందకు దిగిన సమీర్.మహీర్ ను కిందికి దిగాడు.

అనంతరం వారి ఇద్దరి మధ్య చాలా సేపు గొడవ జరిగింది.ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మహిర్ ను అదుపులోకి తీసుకున్నారు.

చివరకు పోలీసులు అతడి పై వివిధ సెక్షన్ల కేసులు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ.

వామ్మో ఇది మరీ దారుణంగా ఉందని కామెంట్ చేస్తూ ఉంటే.మరికొందరు ఇలాంటి వారిని కచ్చితంగా శిక్షించాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube