సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శోభిత(Sobhita ) అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. డిసెంబర్ 4వ తేదీ శోభిత నాగచైతన్యల (Naga Chaitanya) వివాహం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది.
సమంతకు(Samantha) విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య రెండోసారి శోభిత మెడలో మూడు ముళ్ళు వేశారు.ఇక వీరిద్దరు తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
సమంతకు(Samantha ) విడాకులు ఇచ్చిన తర్వాత శోభితతో తనకు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందని, నాగచైతన్య శోభిత ప్రేమ గురించి బయటపెట్టారు.ఇలా పెళ్లి తర్వాత ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు.

పెళ్లి తర్వాత శోభిత తన జీవితంలో జరిగే అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.ఇటీవల సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ దంపతులు తమ సంక్రాంతి వేడుకలకు(Sankranti celebrations) సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు.అయితే తాజాగా శోభిత మరొక గుడ్ న్యూస్ అభిమానులతో పంచుకున్నారు.మరి శోభిత చెప్పిన ఆ గుడ్ న్యూస్ ఏంటి అనే విషయానికి వస్తే… శోభిత హాలీవుడ్ సినిమాలలో కూడా నటించిన విషయం మనకు తెలిసిందే.
ది మంకీ మాన్ (The Monkey Man) అనే హాలీవుడ్ సినిమాలో ఈమె నటించారు.

తాజాగా ఈ సినిమా అంతర్జాతీయ అవార్డ్ నామినేషన్ లో చోటు సంపాదించుకుంది.అంతేకాదు రాటన్ టమాటోస్ టు బెస్ట్ రివ్యూడ్ మూవీగా కూడా అగ్ర స్థానం సంపాదించింది.అదేవిధంగా బెస్ట్ యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీస్ క్యాటగిరిలో కూడా చోటు సంపాదించుకుంది.
దీంతో తను నటించిన ఈ సినిమా ఇలా సక్సెస్ అందుకోవడంతో శోభిత ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఇది కలా లేక నిజమా అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.