ఎల్లారెడ్డిపేట ఆలయాల లో బోరుబావులు త్రవ్వకాలకు భూమి పూజ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎంపి ల్యాడ్స్ ద్వారా మంజూరు చేసిన నిధులతో ఎల్లారెడ్డిపేటలోని మడేలయ్య దేవాలయం ఆవరణలో, వేణుగోపాలస్వామి ఆలయ వ్యవసాయ భూమి లో బోరు వేసే కార్యక్రమాలకు బిజెపి నాయకులు భూమి చేశారు.మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో జరిగిన భూమి పూజ కార్యక్రమములో మండల బిజెపి అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డ బోయిన గోపి,

 Bhumi Puja For Digging Borewells In Ellareddypet Temples, Bhumi Puja ,digging Bo-TeluguStop.com

మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బంధారపు లక్ష్మారెడ్డి, పారిపల్లి సంజీవరెడ్డి ,పట్టణ అధ్యక్షుడు నంది నరేష్,బిపేట రమేష్, చందుపట్ల రామిరెడ్డి , వంగ శ్రీకాంత్ రెడ్డి, చందుపట్ల రాజిరెడ్డి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కిరణ్ నాయక్, బుర్కా వేణు, దీటీ నరసయ్య ,కొన్న పోచయ్య , హనుమయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఆలయాల్లో నీటి సౌకర్యం కల్పించుటకు నిధులు మంజూరు చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube