యాదాద్రి భువనగిరి జిల్లా: దేశంలోని జార్ఖండ్, మహారాష్ట్ర సహా వివిధ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం ఖాయమని యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు గంగుల వెంకటరాజిరెడ్డి అన్నారు.రామన్నపేట మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు నమ్మరని,దేశాన్ని, రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడగలిగే శక్తి కాంగ్రెస్ కు మాత్రమే ఉందన్నారు.
బీజేపీతో పాటు ప్రజా వ్యతిరేక శక్తులను ఎండగడుతూ మహారాష్ట్రలో తెలంగాణ కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు నిర్వహిస్తున్న ప్రచారానికి అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.దేశ ప్రజలు భావి ప్రధానిగా 2029 లో రాహుల్ గాంధీని చూడాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.
తెలంగాణలో జరిగే స్థానిక ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్,బీజేపీ లకు భంగపాటు తప్పదన్నారు.కాంగ్రెస్ దేశ ప్రజలకు సురక్షితమైన భద్రతను,పరిపాలనను అందించే సత్తా ఉన్న పార్టీ అని తెలిపారు.