రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాలయాల్లో 9వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు(students with disabilities) 2024-25 విద్యా సంవత్సరానికి గాను జాతీయ ఉపకార వేతనం వెబ్ సైట్ నందు నూతన మరియు రెన్యువల్ ప్రి మెట్రిక్ ఉపకార వేతనాలు,ఇంటర్, ఓకేషనల్, ప్రోఫెషనల్, డిగ్రీ మరియు ఆపై తరగతులు/కోర్సులు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న దివ్యాంగ విద్యార్థిని, విద్యార్థులకు పోస్ట్ – మెట్రిక్,టాప్ క్లాసు ఎడ్యుకేషనల్ ఉపకరణాల వేతనాల కొరకు www.scholorships.gov.in లేదా www.depwd.gov.in ఆన్ లైన్ వెబ్ సైట్ నందు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు తేది 31.08.2024 వరకు, పోస్ట్ మెట్రిక్ మరియు టాప్ క్లాసు ఎడ్యుకేషనల్ ఉపకార వేతనాలకు తేది:31-10-2024 వరకు దరఖాస్తు చేసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారని శ్రీ పి.లక్ష్మి రాజం, జిల్లా సంక్షేమ అధికారి, మహిళాలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్దులు మరియు ట్రాన్స్ జెండర్స్ సాధికారిత సంక్షేమ శాఖ, రాజన్న సిరిసిల్ల తెలుపనైనది.
మరిన్ని వివరాల కొరకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, G-33, సమీకృత జిల్లా అధికారుల కార్యాలయం (కలెక్టరేట్), రగుడు x రోడ్, రాజన్న సిరిసిల్ల నందు సంప్రదించగలరు
.