సూర్యాపేట జిల్లా:కోదాడ( Kodad ) లోని పలు వార్డుల్లో వీధి కుక్కల దాడి పెరిగిపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బుధవారం సాయంత్రం పట్టణంలోని 26వ వార్డులో షేక్ అష్రఫ్ అనే బాలుడు ట్యూషన్ వెళ్లి వస్తుండగా కుక్కలు దాడిచేసి గాయపరిచాయి.
స్థానికులు గమనించి బాలుడిని ఇంటికి చేర్చారు.
వీధి కుక్కలతో పిల్లలు బయటికి వచ్చే పరిస్థితి లేదని మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు