అనంత్ అంబానీ రిసెప్షన్ ఉపాసన ధరించిన డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?

ఇటీవల జరిగిన అనంత్ అంబానీ( Ananth Ambani ) రాధిక మర్చంట్ ( Radhika Marchant ) వివాహపు వేడుకలలో భాగంగా సినీ తారలు పెద్ద ఎత్తున సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇలా ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు సౌత్ ఇండియన్ స్టార్ సెలబ్రిటీలు కూడా ఈ పెళ్లి వేడుకలలో పాల్గొని సందడి చేశారు.

 Do You Know The Cost Of Upasana Out Fit At Ambani Wedding Reception , Upasana,-TeluguStop.com

ప్రస్తుతం వీరి వివాహం పూర్తి అయినప్పటికీ ఈ వివాహ వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో సంచలనగా మారాయి.ఇక ఈ వివాహ వేడుకలలో భాగంగా సినీ స్టార్స్ అందరూ కూడా ఒకే చోట కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మెగా కపుల్స్ రామ్ చరణ్( Ramcharan ) ఉపాసన (Upasana) దంపతులు కూడా ఈ పెళ్లి వేడుకలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.వీరిద్దరూ గతంలో జామ్ నగర్ లో జరిగిన ఫ్రీ వెడ్డింగ్ వేడుకకు కూడా హాజరయ్యారు.ఇక పెళ్లి వేడుకలలో కూడా ఉపాసన రాంచరణ్ దంపతులు పాల్గొని సందడి చేశారు.ఈ దంపతులకు అంబానీ ఫ్యామిలీ ఎంతో అద్భుతమైన స్వాగతం పలికారు.ఇలా ప్రతి ఒక్క సెలబ్రిటీని కూడా ఎంతో మర్యాదపూర్వకంగా స్వాగతిస్తూ వారి గొప్పతనాన్ని చాటుకున్నారు.

ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా ఉపాసన తన అమ్మ చీరను రీ మోడల్ చేయించి ధరించిన సంగతి మనకు తెలిసిందే.ఇకపోతే రిసెప్షన్ వేడుకలో భాగంగా ఉపాసన ధరించిన డ్రెస్ సైతం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది అయితే ప్రస్తుతం ఈమె వేసిన ఈ డ్రెస్ ఖరీదు గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ రిసెప్షన్ కార్యక్రమంలో భాగంగా ఉపాసన జయంతి రెడ్డి రూపొందించిన బీజ్ ఎంబ్రాయిడరీ సిల్క్ అనార్కలి సెట్ ను ధరించారు.ఈ సెట్ ధర అక్షరాల రూ, 1.49 లక్షలు అని తెలియడంతో ఒక్కసారిగా నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube