యూఎస్ కాంగ్రెస్ ఎన్నికలు : పెన్సిల్వేనియా ప్రైమరీలో భారత సంతతి మహిళ భవినీ పటేల్ ఓటమి

యూఎస్ కాంగ్రెస్( US Congress ) ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ తరపున బరిలో నిలిచిన భారత సంతతికి చెందిన భవినీ పటేల్ డెమొక్రాటిక్ ప్రైమరీ కాంగ్రెషనల్ రేసులో ఓటమిపాలయ్యారు.ప్రస్తుతం కాంగ్రెస్ వుమెన్‌గా వున్న సమ్మర్ లీ 12 కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ పెన్సిల్వేనియా ప్రైమరీ రేసులో విజేతగా అంచనా వేయబడ్డారు.

 Indian American Bhavini Patel Loses Pennsylvania Congressional Primary , Congres-TeluguStop.com

లీకి 59 శాతం ఓట్లు రాగా.భవినీ పటేల్‌కు 41 శాతం ఓట్లు పోలయ్యాయి.

ఊహించినట్లుగానే అధ్యక్షుడు జో బైడెన్ ( Joe Biden ) , రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ తమ తమ ప్రెసిడెన్షియల్ ప్రైమరీలలో విజయం సాధించారు.బైడెన్‌కు 94 శాతం , ట్రంప్‌కు 80 శాతం , మార్చిలో అధ్యక్ష బరిలోంచి తప్పుకున్న భారత సంతతి నేత నిక్కీ హేలీకి( Nikki Haley ) పెన్సిల్వేనియా ప్రైమరీలో 20 శాతం ఓట్లు పోలయ్యాయి.

Telugu American Puc, Indianamerican, Joe Biden, Nikki Haley, Congress-Telugu Top

భవినీ పటేల్.జో బైడెన్‌కు గట్టి మద్ధతుదారు.తాము చూసిన అత్యంత ప్రగతిశీల అధ్యక్షులలో బైడెన్ ఒకరని ఆమె తెలిపారు.మౌలిక సదుపాయాల బిల్లు, ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టం వంటి కీలక బిల్లులను బైడెన్ తీసుకొచ్చారని భవినీ ప్రశంసించారు .తన జిల్లాలో సానుకూల ప్రచారాన్ని నిర్వహిస్తున్నప్పటికీ.జాతి విద్వేషానికి ఆమె గురయ్యారు.

దీంతో దేశవ్యాప్తంగా హిందూ, యూదు సంఘాలు పటేల్‌కు మద్ధతుగా నిలిచాయి.హిందూ అమెరికన్ పీయూసీ( American PUC ) భవినీ కోసం నిధుల సేకరణను సైతం నిర్వహించింది.

Telugu American Puc, Indianamerican, Joe Biden, Nikki Haley, Congress-Telugu Top

తాము కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ, పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయం( Carnegie Mellon University, University of Pittsburgh ), ఇతర విశ్వవిద్యాలయ సంస్థలకు కేంద్రంగా వున్నామని భవినీ పటేల్ అన్నారు.చాలా మంది విద్యార్ధులు భారత్ నుంచి ఇక్కడికి వస్తున్నారని .వారు డిగ్రీలు సంపాదిస్తారని, ప్రజలు వర్సిటీలలోకి, వర్క్‌ఫోర్స్‌లోకి స్వేచ్ఛగా ప్రవేశించడానికి, చిన్న వ్యాపారాలను నిర్మించడానికి, పటిష్టమైన వీసా ప్రోగ్రామ్‌ను రూపొందించడానికి అండగా నిలుస్తామని భవినీ తన ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు.మన తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభాన్ని అధిగమించడానికి కృషి చేస్తానని పటేల్ పేర్కొన్నారు.

భారత్‌లోని గుజరాత్ మూలాలున్న భవినీ పటేల్ తల్లి అమెరికాకు వలసవచ్చారు.దీనిపై ఓ ఇంటర్వ్యూలో భవినీ పటేల్ మాట్లాడుతూ.

యూఎస్‌లో అడుగుపెట్టిన తర్వాత తన తల్లి తనను తన సోదరుడిని సింగిల్ పేరెంట్‌గా పెంచేందుకు ఎంతో శ్రమించారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube