తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో రజినీకాంత్ ( Rajinikanth)ను మించిన నటుడు లేడు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఎందుకంటే ఆయన చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయన్ని సూపర్ స్టార్ గా నిలబెట్టాయి.
ఇక ఇప్పటికే ఆయన 74 సంవత్సరాల వయసులో కూడా సినిమాలు చేస్తే ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడమే కాకుండా వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాయి.
ఇక ఇప్పుడు రజనీకాంత్ లోకేష కనకరాజ్( Lokesh Kanagaraj, ) డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా తో మరోసారి తనను తాను పల్టబ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.మరి ఇలాంటి క్రమంలో రజనీకాంత్ చేస్తున్న ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ ని సాధిస్తుందనేది కూడా తెలియాల్సి ఉంది.అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు.
ఇక మొత్తానికైతే ఈ సినిమాను మరోసారి భారీగా ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.ఇక ఈ సినిమా టైటిల్ ని కూడా రిలీజ్ చేశారు.
ఇంతకు ముందు తలైవా 171 వర్కింగ్ టైటిల్ గా ఉండేది.ఇక ఇప్పుడు ‘కూలీ( Coolie )’ అనే టైటిల్ రివిల్ చేసి అద్భుతమైన టీజర్ ను అయితే ప్రేక్షకుల ముందు ఉంచాడు.
అయితే ఈ సినిమా టీజర్ ను బట్టి చూస్తే రజనీకాంత్ దీంట్లో నెగిటివ్ పాత్రను పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది.దానికి తగ్గట్టుగానే డైలాగులను కూడా చెప్పి ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసే ప్రయత్నం అయితే చేశాడు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో రజనీకాంత్ ఒక భారీ సక్సెస్ ని సాధించబోతున్నట్టుగా తెలుస్తుంది…ఈ సినిమాతో కనక రజిని సక్సెస్ సాదిస్తే ఇప్పటికి కూడా తనే నెంబర్ వన్ హీరో కూడా మరుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…