అదే మరి మన టాలీవుడ్ కి బాలీవుడ్ కి ఉన్న అతిపెద్ద తేడా !

ఎలక్షన్ సమీపిస్తున్నాయి అంటే ఇటీవల కాలంలో ఒక కొత్త ఒరవడి కనిపిస్తుంది.పొలిటికల్ బేస్ గా కొన్ని సినిమాలు విడుదలవుతున్నాయి.

 Political Base Movies In Election Time , Political Base Movies, Tollywood, Bolly-TeluguStop.com

అటు కేంద్రం లో ఉన్న బిజెపి తమ వంతుగా పోయిన ఎలక్షన్స్ లో అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ కి కొంత ముందుగా అన్ని రకాలుగా ఆలోచించి కొన్ని సినిమాలను ప్రేక్షకుల మీద వదులుతుంది.ఎందుకంటే ఒక వ్యక్తిని బలంగా ప్రభావితం చేసే మీడియా ఏదైనా ఉంది అంటే కేవలం సినిమా మాత్రమే.

అందుకే దేశభక్తి లేదా కొన్ని హిందుత్వం వంటి కారణాలతో సినిమాలను తీసి ప్రేక్షకుల మీద వదులుతూ వారి నిర్ణయాలను అలాగే విధానాలను మార్చుకునేందుకు అవకాశం గా ఉంటుంది అనుకునే సినిమాలు తీస్తున్నారు.

Telugu Andhra, Article, Bollywood, Kashmiri, Kerala, Time, Rajdhani, Razakar, Sh

ఇక మన ఆంధ్ర, తెలంగాణ ఎలక్షన్స్ ( Andhra , Telangana Elections ) లో తెలుగు సినిమాల విషయానికి వస్తే వ్యూహం, యాత్ర, రజకార్, శపథం, రాజధాని ఫైల్స్( Vyuham , Yatra, Razakar, Shapathem , Rajdhani Files ) వంటి సినిమాలు వచ్చాయి.అలాగే బాలీవుడ్ విషయానికొస్తే యూరి, ఆర్టికల్ 370, కేరళ స్టోరీస్, కాశ్మీరీ ఫైల్స్ ( Yuri, Article 370, Kerala Stories, Kashmiri Files ) వంటి సినిమాలు వచ్చాయి.ఇవన్నీ పూర్తిగా బీజేపీ భావజాలం ఉన్న సినిమాలు కావడం విశేషం.

ఒకరకంగా చెప్పాలంటే అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు పొలిటికల్ క్యాంపెయిన్ సినిమాలు నడుస్తున్నాయి.అయితే ఇక్కడ స్టాండర్డ్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి.

తెలుగు సినిమాలకి బాలీవుడ్( Bollywood ) సినిమాలకి క్వాలిటీ విషయంలో తేడా మాత్రం కచ్చితంగా కనిపిస్తుంది.ఇలాంటి పొలిటికల్ సినిమాలు వచ్చినప్పుడు అవి పూర్తిగా నాసిరకంగా తెరపైకి వస్తున్నాయి మన తెలుగులో.

కానీ బాలీవుడ్ దర్శకులు ఇలాంటి సినిమాలను డీల్ చేస్తున్న విధానం, వారి గట్స్ కి మెచ్చుకోకుండా ఉండలేం.

Telugu Andhra, Article, Bollywood, Kashmiri, Kerala, Time, Rajdhani, Razakar, Sh

ఎంతో సున్నితమైన అంశాలను గీత దాటకుండా అంతే సీరియస్ గా చర్చిస్తూ ప్రేక్షకులను ఆసాంతం థియేటర్ లో సీటుకు అతుక్కుపోయేలా చేస్తున్నారు బాలీవుడ్ దర్శకులు.అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు దొర్లిన కూడా అవేమీ సినిమాపై ప్రభావాన్ని చూపించడం లేదు.మన తెలుగులో అయితే ఎలాంటి చరిత్రకైనా మసాలా అద్ది కమర్షియల్ సినిమాగా మార్చేసి వక్రీకరించే విధంగా సినిమాను తెరకెక్కిస్తు ఉంటారు.

అది బాలీవుడ్ దర్శకులలో కనిపించడం లేదు.వారు సినిమాలు చాలా చక్కగా డీల్ చేస్తున్నారు.ఆర్టికల్ 370 విషయంలో 370 అనే నెంబర్ కేవలం ఒక చట్టం మాత్రమే కాదు బిజెపికి రావాల్సిన ఎంపీ ల లెక్క కూడా అంతే.అందుకే ఇలాంటి సినిమాలకు ఎక్కువగా ఆ క్యాంపు పని చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube