అదే మరి మన టాలీవుడ్ కి బాలీవుడ్ కి ఉన్న అతిపెద్ద తేడా !

ఎలక్షన్ సమీపిస్తున్నాయి అంటే ఇటీవల కాలంలో ఒక కొత్త ఒరవడి కనిపిస్తుంది.పొలిటికల్ బేస్ గా కొన్ని సినిమాలు విడుదలవుతున్నాయి.

అటు కేంద్రం లో ఉన్న బిజెపి తమ వంతుగా పోయిన ఎలక్షన్స్ లో అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ కి కొంత ముందుగా అన్ని రకాలుగా ఆలోచించి కొన్ని సినిమాలను ప్రేక్షకుల మీద వదులుతుంది.

ఎందుకంటే ఒక వ్యక్తిని బలంగా ప్రభావితం చేసే మీడియా ఏదైనా ఉంది అంటే కేవలం సినిమా మాత్రమే.

అందుకే దేశభక్తి లేదా కొన్ని హిందుత్వం వంటి కారణాలతో సినిమాలను తీసి ప్రేక్షకుల మీద వదులుతూ వారి నిర్ణయాలను అలాగే విధానాలను మార్చుకునేందుకు అవకాశం గా ఉంటుంది అనుకునే సినిమాలు తీస్తున్నారు.

"""/" / ఇక మన ఆంధ్ర, తెలంగాణ ఎలక్షన్స్ ( Andhra , Telangana Elections ) లో తెలుగు సినిమాల విషయానికి వస్తే వ్యూహం, యాత్ర, రజకార్, శపథం, రాజధాని ఫైల్స్( Vyuham , Yatra, Razakar, Shapathem , Rajdhani Files ) వంటి సినిమాలు వచ్చాయి.

అలాగే బాలీవుడ్ విషయానికొస్తే యూరి, ఆర్టికల్ 370, కేరళ స్టోరీస్, కాశ్మీరీ ఫైల్స్ ( Yuri, Article 370, Kerala Stories, Kashmiri Files ) వంటి సినిమాలు వచ్చాయి.

ఇవన్నీ పూర్తిగా బీజేపీ భావజాలం ఉన్న సినిమాలు కావడం విశేషం.ఒకరకంగా చెప్పాలంటే అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు పొలిటికల్ క్యాంపెయిన్ సినిమాలు నడుస్తున్నాయి.

అయితే ఇక్కడ స్టాండర్డ్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి.తెలుగు సినిమాలకి బాలీవుడ్( Bollywood ) సినిమాలకి క్వాలిటీ విషయంలో తేడా మాత్రం కచ్చితంగా కనిపిస్తుంది.

ఇలాంటి పొలిటికల్ సినిమాలు వచ్చినప్పుడు అవి పూర్తిగా నాసిరకంగా తెరపైకి వస్తున్నాయి మన తెలుగులో.

కానీ బాలీవుడ్ దర్శకులు ఇలాంటి సినిమాలను డీల్ చేస్తున్న విధానం, వారి గట్స్ కి మెచ్చుకోకుండా ఉండలేం.

"""/" / ఎంతో సున్నితమైన అంశాలను గీత దాటకుండా అంతే సీరియస్ గా చర్చిస్తూ ప్రేక్షకులను ఆసాంతం థియేటర్ లో సీటుకు అతుక్కుపోయేలా చేస్తున్నారు బాలీవుడ్ దర్శకులు.

అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు దొర్లిన కూడా అవేమీ సినిమాపై ప్రభావాన్ని చూపించడం లేదు.

మన తెలుగులో అయితే ఎలాంటి చరిత్రకైనా మసాలా అద్ది కమర్షియల్ సినిమాగా మార్చేసి వక్రీకరించే విధంగా సినిమాను తెరకెక్కిస్తు ఉంటారు.

అది బాలీవుడ్ దర్శకులలో కనిపించడం లేదు.వారు సినిమాలు చాలా చక్కగా డీల్ చేస్తున్నారు.

ఆర్టికల్ 370 విషయంలో 370 అనే నెంబర్ కేవలం ఒక చట్టం మాత్రమే కాదు బిజెపికి రావాల్సిన ఎంపీ ల లెక్క కూడా అంతే.

అందుకే ఇలాంటి సినిమాలకు ఎక్కువగా ఆ క్యాంపు పని చేస్తుంది.

నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా.. హైపర్ ఆది వార్నింగ్ మామూలుగా లేదుగా!