ఈ మధ్యకాలంలో కొంతమంది సినిమా ఇండస్ట్రీ( Film Industry ) వాళ్ళు వెళ్లిన వాళ్లంతా కూడా మళ్లీ రీఎంట్రీ ఇచ్చే పనిలో ఉన్నారు.ఎందుకంటే ఒకప్పుడు కన్నా కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు ఎక్కువ.
ఓటిటిలో లేదంటే వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ అంటూ యూట్యూబ్లో కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి.అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని బడ్జెట్ మూవీస్ కూడా వరుస పెట్టి విడుదలవుతున్నాయి కాబట్టి అవకాశాలకు కొదవ లేకుండా పోయింది.
ఈ దువ్వలోనే ఇప్పుడు పెళ్ళాం ఊరెళితే( Pellam Oorelithe ) అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న ఒక సీనియర్ నటి కం బ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది.

ఆ నటి మరెవరో కాదు ప్రశాంతి హారతి( Prashanthi Harathi ). క్లాసికల్ డాన్స్ లో మాస్టర్స్ పట్టా పొందిన ప్రశాంతి తొలుత సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి ఆమె డ్యాన్స్ కూడా కారణం అయ్యింది.చాలామంది ఆమె చక్కగా నాట్యం చేస్తుంది అనే కారణంతో సినిమాలోకి రమ్మని అడిగేవారట.
అలా నెమ్మదిగా సినిమా ఇండస్ట్రీకి వచ్చి కొన్ని సినిమాల్లో నటించిన ఇంద్ర సినిమా( Indra )తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ చిత్రంలో షౌకత్ అలీ ఖాన్ కూతురుగా నటించి ప్రశాంతి వలస పెట్టి అవకాశాలు దక్కించుకుంది.ఆ తర్వాత సునీల్ సరసన కామెడీ పాత్రతో ఇలా ఊరెళితే అనే సినిమాలో నటించింది.

ఈ చిత్రాలు అనుకున్నట్టుగా మంచి పేరు తీసుకొచ్చాయి కానీ ఇంట్లో వాళ్ళు ఇక సినిమాలు మానేసి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో ఆమె కూడా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది.దాదాపు ఇది జరిగే 20 ఏళ్లవుతుంది.ఇప్పుడు ఆమె మళ్ళీ రిఎంట్రీ( Re Entry ) ఇస్తుంది ఇటీవల ఎక్కడ చూసినా యూట్యూబ్ లో సోషల్ మీడియాలో ప్రశాంతి హారతి కి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సేషనల్ గా మారిన ప్రశాంతి హారతి అది త్వరలోనే సినిమా ఇండస్ట్రీలో బిజీ అవుతానమే నమ్మకంతో ఉంది.