కే ఎస్ రవి కుమార్( KS Ravi Kumar ) దర్శకత్వంలో కమలహాసన్( Kamala Haasan ) హీరోగా వచ్చిన దశావతారం సినిమా( Dashavataram movie ) సూపర్ డూపర్ సక్సెస్ ను అందుకుంది.తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా డిఫరెంట్ అటెంప్ట్ గా నిలవడమే కాకుండా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచి సూపర్ సక్సెస్ ని సాధించింది.
అయితే కేఎస్ రవికుమార్ ఈ సినిమాని మొదట రజనీకాంత్( Rajinikanth ) తో చేద్దామని అనుకున్నాడట.ఆయన కోసమే కథను కూడా రెడీ చేయించుకున్నాడు.
కానీ రజనీకాంత్ అప్పుడు కొన్ని వేరే సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ఈ పాత్రలో తను చేయలేనని చెప్పాడు దానివల్ల ఈ స్క్రిప్ట్ ని కమలహాసన్ దగ్గరికి తీసుకెళ్లి ఆయనతో ఈ సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అటు డైరెక్టర్ కె ఎస్ రవికుమార్ ఇటు కమహాసన్ ఇద్దరు కూడా భారీ హిట్ దక్కించుకున్నారనే చెప్పాలి.ఈ సినిమాలో కమలహాసన్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పాలి.10 పాత్రలో తను నటించి మెప్పించడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇప్పటివరకు అలాంటి పాత్రలు ఎవరు పోషించలేదు ఇండియన్ సినిమా హిస్టరీ లోనే అలాంటి పాత్రను పోషించిన ఒకే ఒక్క నటుడుగా కమలహాసన్ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇప్పటికీ కూడా ఇండియన్ సినిమాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి దశావతారం సినిమా గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటూ ఉంటారు.ఎందుకంటే ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది…అందుకే ఈ సినిమాతో కమలహాసన్ ఒక భారీ హిట్ కొట్టడమే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీ లో క్లాసిక్ మూవీ ని ప్రేక్షకులకు అందించాడు…ఇక లోక నాయకుడు గా కూడా తనకంటూ ఒక పేరు ను సంపాదించుకున్నాడు…
.