ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ప్రస్తుత కాలంలో మేనిఫెస్టో ఎంతో కీలకం అనే సంగతి తెలిసిందే.మేనిఫెస్టోలోని హామీలను బట్టి ఏ హామీ ఇస్తే మేలు జరుగుతుందో ప్రజలు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
వైసీపీ నవరత్నాలు వర్సెస్ టీడీపీ సూపర్ సిక్స్( TDP super six ) హామీల అమలు గురించి ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది.పేర్లు వేరైనా రెండు పార్టీల వల్ల కలిగే ప్రయోజనాలు దాదాపుగా సమానంగా ఉన్నాయి.
టీడీపీ మహాలక్ష్మి స్కీమ్( Mahalakshmi ) ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం( Free Bus Scheme ) కల్పించడంతో పాటు ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఫ్రీగా ఇస్తుంది.తల్లికి వందనం స్కీమ్ ద్వారా ఇంట్లో చదువుకునే పిల్లలు ఒక్కొక్కరికి 15 వేల రూపాయలు అందజేస్తారు.18 ఏళ్లు నిండిన స్త్రీకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు బ్యాంక్ అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది.
ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వడంతో పాటు పూర్ టు రిచ్ స్కీమ్ ద్వారా పేదలను సంపన్నులను చేస్తామని టీడీపీ చెబుతోంది.రైతులకు అన్నదాత స్కీమ్ ద్వారా 20,000 రూపాయలు అందిస్తామని టీడీపీ వెల్లడిస్తోంది.ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రతి నిరుద్యోగికి నెలకు 3000 రూపాయలు ఇస్తామని టీడీపీ చెబుతోంది.50 సంవత్సరాల వయస్సు పైబడిన వాళ్లకు 4000 రూపాయల పెన్షన్ ను అందజేస్తామని టీడీపీ హామీ ఇస్తుండటం గమనార్హం.వైసీపీ నవరత్నాలు స్కీమ్స్ లో భాగంగా రైతు భరోసా, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, పేదలందరికీ ఇళ్లు వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, పింఛన్ల పెంపు, అమ్మఒడి స్కీమ్స్ ను అమలు చేస్తోంది.
స్కీమ్స్ విషయంలో వైసీపీ పైచేయి సాధిస్తుండగా త్వరలో వైసీపీ( YCP ) మరిన్ని స్కీమ్స్ ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.అయితే అభివృద్ధికి సంబంధించి ఈ రెండు పార్టీలు ఎలాంటి హామీలు ఇస్తాయో చూడాల్సి ఉంది.