సూర్యాపేట జిల్లా:ఈనెల 8 నుండి ప్రారంభమైన మేళ్లచెరువు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేడు పవళింపు సేవతో ముగిశాయి.దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శంభులింగేశ్వర స్వామికి భక్తులు సమర్పించిన కానుకల హుండీ లెక్కింపు బుధవారం దేవాదాయ కార్యనిర్వహణ అధికారి వై.
శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో తెరిచి లెక్కించారు.ఈసారిరూ 10,48,012 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి గుజ్జుల కొండారెడ్డి తెలిపారు.మహాశివరాత్రి జాతర సందర్భంగా వివిధ సేవా టికెట్లు కొబ్బరికాయలు,లడ్డు అమ్మకాలు,కొబ్బెర చిప్పల సేకరణ,కళ్యాణం కట్నాలు, షాపుల కిరాయి ద్వారా కానుకల హుండీ లెక్కింపు మొత్తం రూ.38,89,889 ఆదాయం రాగా గత సంవత్సరం కంటే రూ.1,17,831 తగ్గిందనట్లు తెలిపారు.ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఐదు రోజులపాటు జరిగిన జాతరకు 38,900 మందికి అన్నప్రసాద విస్తరణ జరిగిందన్నారు.