ఈ అలవాట్లు మార్చుకోకపోతే మీ గుండెకు ముప్పే.. జాగ్రత్త!!

ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే గుండె సంబంధిత సమస్యలు( Heart related problems ) తలెత్తేవి.

కానీ ఇప్పటి రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు.

యువత కూడా గుండెపోటుకు గురై ప్రాణాలు విడుస్తున్న సంఘటనలు తరచూ మనం చూస్తూనే ఉన్నాము.అందుకే గుండె ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా కొన్ని కొన్ని అలవాట్లను మార్చుకోకపోతే గుండెకు ముప్పు ఖాయమని హెచ్చరిస్తున్నారు.మరి ఇంతకీ గుండె ఆరోగ్యం కోసం మార్చుకోవాల్సిన ఆ అలవాట్లు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ధూమపానం ( Smoking )ఆరోగ్యానికి హానికరం.అలాగే గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.రోజులో ఎక్కువసార్లు ధూమపానం చేసేవారు గుండె పోటుకు గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి.

Advertisement

అందుకే ధూమపానం అలవాటు ఉంటే కచ్చితంగా వదులుకోండి.ప్రస్తుత రోజుల్లో ఎక్కువ శాతం మంది నిద్ర సమయాన్ని వృధా చేస్తున్నారు.

సరిగ్గా నిద్రపోకుండా ఫోన్లు, టీవీలతో సమయం గడుపుతున్నారు.మీకు ఇలాంటి అలవాటు ఉందా.

అయితే గుండెకు ముప్పే.

కంటి నిండా నిద్ర( Sleep ) లేక‌పోవ‌డం వ‌ల్ల ఒత్తిడి పెరుగుతుంది.ఒత్తిడి పెరిగితే ర‌క్త‌పోటు పెరుగుంది.అధిక ర‌క్త‌పోటు గుండెకు ఎంతో డేంజ‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అందుకే కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి.రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలపాటు కచ్చితంగా నిద్రించండి.

Advertisement

ఎక్కువ చక్కెర, జంక్ ఫుడ్ గుండె ప‌నితీరును నెమ్మ‌దించేలా చేస్తాయి.వీటి వల్ల కొలెస్ట్రాల్( Cholesterol ), బ్లడ్ ప్రెజర్, బ్లడ్ షుగర్ పెరిగే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌.

కాబట్టి ఆయా ఆహారాలకు దూరంగా ఉండండి.అలాగే కొందరు చిన్న చిన్న విషయాలకు కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.

అలా చీటికి మాటికి ఒత్తిడికి గురైన కూడా గుండెపోటు వచ్చే రిస్క్ ఉంటుంది .కాబ‌ట్టి సమస్య ఎలాంటిదైనా సరే వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండండి.ఇక కొందరు బరువు తగ్గడానికి లేదా కండరాలు పెంచుకునేందుకు అతిగా వ్యాయామం చేస్తుంటారు.

వ్యాయామం చెయ్యకపోవడం ఎంత ప్రమాదకరమో అతిగా చేయడం కూడా అంతే ప్రమాదకరం.ఓవర్ గా వర్కౌట్స్ చేస్తే గుండెపై తీవ్రంగా ప్రభావం పడుతుంది.

గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.సో.అతిగా వ్యాయామం చేసే అలవాటు మానుకోండి.

తాజా వార్తలు