యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) ఫ్యాన్స్ మాత్రమే కాదు.యావత్ సినీ లవర్స్ ఉత్సాహంగా ఎదురు చూస్తున్న సినిమాల్లో సలార్ ( Salaar ) కూడా ముందు వరుసలోనే ఉంది అని చెప్పాలి.
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై ఇప్పటికే భారీ హోప్స్ నెలకొన్నాయి.
మరి రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఈ వారం మొత్తం భారీ ప్రమోషన్స్ చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.తాజాగా టాలీవుడ్ అగ్ర డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి( SS Rajamouli ) సలార్ టీమ్ తో కలిసి ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే.
ఈ ఇంటర్వ్యూ కోసం అంత ఎదురు చూస్తున్నారు.
అతి త్వరలోనే ఈ ఇంటర్వ్యూ రిలీజ్ చేయనున్నారు.మరి ఈ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తుండగానే మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.ఈ ఇంటర్వ్యూ మాత్రమే కాకుండా మరో భారీ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారట.
ప్రభాస్, పృథ్వీ రాజ్ తో( Prithviraj Sukumaran ) పాటు శృతి హాసన్ కలిసి ఒక సూపర్ ఫన్ ఇంటర్వ్యూ చేయనున్నారట.ఇది షూట్ చేసి మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.
కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషించగా డిసెంబర్ 22న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.చూడాలి ఈ మూవీ ఎలాంటి హిట్ ఇస్తుందో.