Sharwanand : తండ్రి అయిన హీరో శర్వానంద్… ఆడబిడ్డకు జన్మనిచ్చిన రక్షిత?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు శర్వానంద్( Sharwanand ) ఒకరు.ఈయన హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

 Sharwanand Blessed Baby Girl And Reveals Her Name Tollywood-TeluguStop.com

ఇదిలా ఉండగా తాజాగా శర్వానంద్ తండ్రి అయ్యారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.శర్వానంద్ తన భార్య కుమార్తెతో కలిసి ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ వార్త వైరల్ అవుతుంది.

శర్వానంద్ గత ఏడాది జూన్ మూడవ తేదీ రక్షిత రెడ్డి ( Rakshitha Reddy ) అనే అమ్మాయితో కలిసి ఏడడుగులు నడిచారు.

ఇలా వీరి వివాహం జరిగి ఏడాది కూడా కాకుండానే పండంటి ఆడబిడ్డకు( Baby Girl ) జన్మనిచ్చారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒకసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు.అసలు ప్రెగ్నెన్సీ అనే విషయాన్ని కూడా ప్రకటించలేదు ఏకంగా కూతురు పుట్టిందని చెప్పేసావ్ ఏంటి అన్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక శర్వా నంద్ పుట్టినరోజు సందర్భంగా తనకు కూతురు పుట్టిందనే విషయాన్ని తెలియజేస్తూ అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.

ఇలా తన భార్య కుమార్తెతో కలిసి ఉన్నటువంటి ఫోటోలను ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.రక్షిత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని తన పేరు లీలాదేవి మైనేని ( Leela Devi Myneni ) అంటూ తన కుమార్తె పేరును కూడా రివీల్ చేశారు.ఇక ఈయన తన పుట్టినరోజు సందర్భంగా సినిమాల నుంచి అప్డేట్ కాకుండా తనకు కుమార్తె పుట్టింది అనే విషయాన్ని తెలియజేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube