స్మగ్లింగ్ బంగారానికి అడ్డాగా హాలియా...!

నల్లగొండ జిల్లా : హాలియా పట్టణంలోని రెండు బంగారు షాపులు స్మగ్లింగ్ బంగారానికి అడ్డగా మారాయని తెలుస్తోంది.ఇతర రాష్ట్రాల నుండి ఎలాంటి టాక్స్ లేకుండా గుట్టుచప్పుడు కాకుండా స్మగ్లింగ్ బంగారం తీసుకొచ్చి మార్కెట్ ధరకంటే రూ.500 నుంచి రూ.1000 లకు తక్కువగా తండా వాసులకు కట్టబెడుతూ అక్రమ వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువత్తుతున్నాయి.ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడ స్ట్రగ్లింగ్ బంగారం దొరికినా అది హాలియాకే వస్తుందనే ప్రచారం జరుగుతుంది.స్మగ్లింగ్ బిస్కెట్ బంగారం మార్కెట్ ధర కంటే తక్కువగా రావడంతో వాటిని కొనుగోలు చేసి విక్రయించడం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తున్నందున, సులభంగా డబ్బు సంపాదించేందుకు ఇక్కడి వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారనే టాక్ వినిపిస్తుంది.

 Illegal Gold Smuggling In Nalgonda District, Illegal Gold Smuggling ,nalgonda Di-TeluguStop.com

బంగారం వ్యాపారానికి హాలియా ప్రసిద్ధిగాంచింది.వాణిజ్య, రవాణాపరంగా సౌకర్యాలు ఉండటం,ఆంధ్రా సరిహద్దు కావడం వల్ల ఈ బంగారం వ్యాపారం జోరుగా సాగుతోంది.

ఇక్కడ బంగారం తీసుకున్న వారికి డోర్ డెలివరీ సదుపాయం ఉంటుంది.తండాలకు వెళ్లి మీకు ఏ అభరణాలు కావాలన్నా తక్కువకు చేసి ఇంటికి తెచ్చి ఇస్తామని తండావాసుల్ని వారి గుప్పెట్లో పెట్టుకుంటారు.

వీరికి ప్రతిరోజు 20 నుంచి 30 తులాల బంగారు వస్తువుల ఆర్డర్ ఉంటుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఎలాంటి జిఎస్టి బిల్లులు లేకుండా క్రయ విక్రయాలు జరుపుతూ చూడడానికి చిన్న షాపుల్లానే కనిపిస్తూ రూ.

కోట్లల్లో చీకటి వ్యాపారం సాగిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.వీరికి రోజువారీ ఆదాయం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుందంటే అతిశయోక్తి కాదు.ఇంత పెద్ద మొత్తంలో స్మగ్లింగ్ బంగారం విక్రయాలు జరుగుతున్నా సంబంధిత అధికారులకు తెలియక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి హాలియా కేంద్రంగా జరుగుతున్న స్మగ్లింగ్ బంగారం విక్రయాలపై నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

స్మగ్లింగ్ బంగారం కోసం 20 నుండి 35 ఏళ్లలోపు యువకులను ప్రత్యేకంగా గుమస్తాలను ఏర్పాటు చేసుకొని,వారికి రూ.10 నుండి రూ.15వేల వేతనం ఇస్తున్నట్లు సమాచారం.వీరు రైలు,బస్సు, కొన్ని సందర్భాల్లో స్కూటీ పైన ఈ అక్రమ రవాణాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎవరికీ అనుమానం రాకుండా ఇక్కడి వర్కర్లతోనే తయారీ చేసి మార్కెట్లో సేల్ చేస్తున్నారని, వారికి ఒక ఫోన్ ఇచ్చి పంపుతారు.ఒకరికి మరొరడు తెలియకుండా ఫోన్ సంభాషణ ద్వారా అంతా ఓకే అనుకున్న తదుపరి పరస్పరం మార్చుకుంటారు.

ఎక్కడ స్ట్రగ్లింగ్ బంగారం దొరికిన అది హాలియా చుట్టూ తిరుగుతుంది.అందులో ప్రధానంగా షాపులకు చెందిన వారు మాత్రమే ఈ తరహ స్మగ్లింగ్ వ్యాపారం చేస్తూ ఏకంగా బిల్డింగ్ మీద బిల్లింగ్ వేస్తున్నారు.

స్మగ్లింగ్ బంగారం మీద నిఘా పెంచి అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని హాలియా సిఐ జనార్దన్ గౌడ్ అన్నారు.

అదేవిధంగా తక్కువ ధరకు బంగారం వస్తుందని ఆశపడి కొనుగోలు చేస్తే ఇబ్బందులు పడతారని, బంగారం తక్కువగా అమ్ముతున్నట్లు తెలిస్తే తమకు ఫిర్యాదు చేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

టాక్స్ కట్టకుండా అమ్మకాలు చేపడితే చర్యలు తీసుకుంటామని మిర్యాలగూడ కమర్షియల్ టాక్స్ అధికారి రవినాయక్ హెచ్చరించారు.ప్రభుత్వానికి జీఎస్టీ కట్టకుండా అక్రమ బంగారం అమ్మడం కోనుగోలు చేయడం నేరం.

అలా ఎవరైనా వ్యాపారాలు నిర్వహిస్తే తమ దృష్టికి తీసుకవస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని,.ప్రతి ఒక్కరు షాపులలో కొనుగోలు చేసిన వస్తువుకు బిల్లు తీసుకోవాలని,ఒకవేళ ఇవ్వకుంటే తమకు ఫిర్యాదు చేయాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube