ఏపీలో వైసీపీ రెబల్ ఎమ్మెల్సీల( YCP Rebel MLCs ) అనర్హత పిటిషన్లపై విచారణ జరుగుతుంది.ఈ మేరకు అనర్హత పిటిషన్లపై శాసనమండలి ఛైర్మన్ మోషేను రాజు( Legislative Council Chairman Moshenu Raju ) విచారణ చేపట్టారు.
కాగా ఈ విచారణకు ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి.రామచంద్రయ్య హాజరయ్యారు.అయితే వీరి వివరణ తీసుకున్న తరువాత అనర్హత వేటుపై ఛైర్మన్ మోషేను రాజు నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి రామచంద్రయ్య తమ పార్టీ తరపున ఎన్నికై తరువాత వేరే పార్టీల్లోకి వెళ్లారంటూ
వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి,( Lella Appireddy ) ఎం మురళీధర్ రావు( M Muralidhar Rao ) జనవరిలో శాసనమండలి ఛైర్మన్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.విచారణలో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్సీలు ఓసారి హాజరుకాగా.చివరిసారిగా వ్యక్తిగత విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు.
దీంతో ఎమ్మెల్సీలు ఛైర్మన్ మోషేను రాజు ఎదుట విచారణకు హాజరయ్యారు.