ఉద్యోగ, ఉపాధి అవకాశాలకై నేటి యువత ఉద్యమించాలి: సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు

సూర్యాపేట జిల్లా: నేటి యువత ఎదుర్కొంటున్న ఉద్యోగ,ఉపాధి అవకాశాల కోసం పాలకవర్గాలపై ఉద్యమించాలని సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.జిల్లా కేంద్రంలోని ధర్మ భిక్షం భవన్లో ఆదివారం జరిగిన అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రపంచంలోనే యువకుల సంఖ్య ఎక్కువగా ఉన్న మన భారతదేశం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేని దేశంగా కూడా ముందంజలో ఉందని అన్నారు.

 Todays Youth Should Mobilize For Job And Employment Opportunities Cpi District S-TeluguStop.com

పాలకవర్గాలు ఎన్నికల ప్రచారంలో ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఇంకా ఎన్నో రకాల హామీలను ఇస్తూ వారి ఓట్లను దండుకొని అధికారలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ,ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారి జీవితాలను నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు.

దేశంలో యువత గంజాయి, మత్తుమందు,మద్యపానానికి అలవాటు పడేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలోకి వాటిని ఎక్కువగా తీసుకొస్తున్న వారి పట్ల ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయని ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని,రైతు ఉద్యమాల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని గత కొన్ని రోజుల నుండి ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమాలకు మద్దతుగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సిపిఐ ఆధ్వర్యంలో పార్టీ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున కదిలి జిల్లా సెంటర్లో నిరసన కార్యక్రమం చేయాల్సి ఉన్నదన్నారు.

ఈ నెల 26 ఉదయం 10 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయం ధర్మ బిక్షం భవన్ నుండి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమానికి జిల్లా కౌన్సిల్ సభ్యులు,మండల, పట్టణ కార్యదర్శులు, ప్రజాసంఘాల బాధ్యులు అధిక సంఖ్యలో తరిరావాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి చేపూరి కొండలు,జిల్లా అధ్యక్షుడు చిలకరాజు శ్రీను,సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు అనంతుల మల్లీశ్వరి,సిపిఐ సూర్యాపేట పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు,ఏఐవైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎడెల్లి శ్రీకాంత్,అనంతుల రాము,కడారు మధు, సయ్యద్ ఫయాజ్ మియా, వీరన్న,లింగరాజు,శ్రీను, గోపగాని రవి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube