ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీల పొత్తు వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు.ఇప్పటికే జనసేనతో( Janasena ) పొత్తులో ఉన్న టీడీపీ రాష్ట్రంలోని బీజేపీతో( BJP ) పొత్తు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ వ్యవహారంపై ఇప్పుడే క్లారిటీ రాదని టీడీపీ నేతలు అంటున్నారు.ఈ నెల 16వ తేదీ సాయంత్రం నుంచి మూడు రోజులపాటు ఢిల్లీలో( Delhi ) బీజేపీ జాతీయ విస్తృతస్థాయి సమావేశాలు జరగనున్నాయి.
బీజేపీ సమావేశాలు ముగిసిన తరువాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ ( Chandrababu , Pawan Kalyan )మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈనెల 17న పర్చూరులో రా కదిలిరా సభకు చంద్రబాబు హాజరు కానున్నారు.అలాగే పార్టీలో చేరికలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.మరోవైపు బీజేపీ హైకమాండ్ పిలుపు కోసం పవన్ కల్యాణ్ గత వారం రోజులుగా వేచి చూస్తున్నారు.