తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు ఒకనొక టైమ్ లో సినిమా మేకింగ్ మీద వాళ్ల డెప్త్ ను పరిచయం చేసుకోవాలని చూస్తూ ఉంటారు.ఇక చాలామంది టాలెంటెడ్ దర్శకులకు( Talented Directors ) ఇక్కడ అవకాశం వచ్చినప్పటికి కొన్నిసార్లు బడ్జెట్ ప్రాబ్లం వాళ్ళనో, లేదంటే ఆ స్క్రిప్ట్ మీద కొంచెం కూడా నాలెడ్జ్ లేని మన హీరోలు ఇన్వాల్వ్ అవ్వడం వల్లనో, మంచి కథలు కాస్త చెడిపోతాయి.
దాని వల్ల ఆ యంగ్ డైరెక్టర్లు సినిమాని తెరకెక్కించేటపుడు వాళ్ళు రాసుకున్న స్టోరీ లో ఫ్రెష్ నెస్ అనేది పోతుంది.దానివల్ల కొంత మంది డైరెక్టర్లు వాళ్ళకి టాలెంట్ ఉన్నప్పటికీ ఏం చేయలేక పోతుంటారు.
అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీ లో కొంత మంది ఉన్నారు.ఎవరో చేసిన తప్పుకు కొన్నిసార్లు వాళ్ళు బలి అవుతూ ఉంటారు.
ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వాళ్ళ టాలెంట్ ను పూర్తి స్థాయి లో ప్రూవ్ చేసుకోవడానికి కొంత మంది డైరెక్టర్లు ముందుకు వస్తున్నారు.

ఇక రీసెంట్ గా ప్రశాంత్ వర్మ ఎలాగైతే హనుమాన్ సినిమాతో( Hanuman Movie ) తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడో ఇప్పుడు అదే బాటలో మరో డైరెక్టర్ ఎంట్రీ ఇస్తున్నాడు.సుబ్రహ్మణ్యపురం, లక్ష్య సినిమాలతో డీసెంట్ హిట్లు కొట్టిన సంతోష్ జాగర్లపూడి( Santhossh Jagarlapudi ) ఇప్పుడు ఒక మాసివ్ హిట్ కొట్టడానికి రెఢీ అవుతున్నాడు.ప్రస్తుతం ఆయన సుమంత్ హీరోగా మహేంద్రగిరి వారాహి( Mahendragiri Varahi ) అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా ఒక డిఫరెంట్ అటెంప్ట్ గా రానుంది.దేశవ్యాప్తంగా గా కాంతార సినిమా ఎలాగైతే తన ఐడెంటిటీని సంపాదించుకుందో, ఈ సినిమా కూడా దేవుడి కథ తో తెరకెక్కుతుంది కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇదొక ట్రెండ్ సెట్టర్ గా నిలువబోతుంది అంటూ ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రముఖులు ఈ సినిమా గురించి విపరీతమైన చర్చలు పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందులో భాగంగానే ఈ దర్శకుడుకి పలు ప్రొడక్షన్ హౌజ్ ల నుంచి అడ్వాన్సులు కూడా అందినట్టుగా తెలుస్తుంది.ముఖ్యంగా తెలుగులో భారీ నిర్మాణ సంస్థ అయిన ‘మైత్రి మూవీ మేకర్స్ ‘( Mythri Movie Makers ) వాళ్ళు ఈ యంగ్ డైరెక్టర్ మీద ముందుగానే కర్చీఫ్ వేసినట్టుగా తెలుస్తుంది.

ఇక అలాగే యువ సుధా ఆర్ట్స్ వాళ్లు కూడా ఒక సినిమాకి సంతోష్ తో అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నట్లు గా తెలుస్తుంది.ఈసారి సుమంత్ తో ఆయన చేస్తున్న మహేంద్రగిరి వారాహి సినిమా 100కు 100% హిట్ బొమ్మ గా మారబోతుందనే ఉద్దేశ్యం తోనే ప్రొడ్యూసర్లు ముందుగానే ఈ డైరెక్టర్ ని పట్టేసుకున్నారు.నిజానికి సంతోష్ జాగర్లపూడి ఈ జనరేషన్ లో ఉన్న దర్శకులలో మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్.ఆయన తీసే సినిమాలో మేకింగ్ గాని,ఆయన విజన్ గానీ టాప్ లెవల్లో ఉంటాయి.
ప్రతి ఒక్కరు భారీ స్థాయిలో ఎలివేట్ అవ్వాలంటే దానికి ఒక టైం అనేది రావాలి.సంతోష్ జాగర్లపూడి కి ఆ టైం ఇప్పుడు వచ్చింది.ఇక అందులో భాగంగానే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రవితేజ( Raviteja ) తో ఈయన సినిమా ఉండబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇప్పటికే సంతోష్ రవితేజ కి కూడా సినిమా లైన్ వినిపించినట్టుగా తెలుస్తుంది.
ఆ లైన్ రవితేజ కి బాగా నచ్చి తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గా వార్తలు వస్తున్నాయి.ఇక మొత్తానికైతే సంతోష్ జాగర్లపూడి పేరు కొద్ది రోజుల్లో చాలా గట్టిగా వినిపించబోతుందనేది మాత్రం చాలా క్లారిటీ గా తెలుస్తుంది…
.