రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో శుక్రవారం మాఘ అమావాస్య పండుగ కన్నుల పండుగగా జరిగింది.మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ కేశవ పెరమాండ్ల ఆంజనేయ స్వామి ఆలయం లో శుక్రవారం రోజున మాఘ అమావాస్య సందర్భంగా పుణ్యకోచనం అభిషేకం నవగ్రహాల పూజ విశ్వక్సేన ఆరాధన విష్ణు అష్టోత్రం ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు తీవిక్రమా చారి, రామాచారి, మాధవాచారి , విష్ణు చారి, కేశవ చారి, విజయ చారి, సింహాచలం విద్యాసాగర్, తిరుణహారి, విష్ణు భగవాత్ , శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ అర్చకులు బిట్కూరి నవీన్ చారి ఘనంగా నిర్వహించారు.
భక్తులు అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారము శ్రీ ఆంజనేయస్వామి రాతి విగ్రహం ఎదుట మాఘ అమావాస్య సందర్భంగా అఖండ దీపాన్ని వెలిగించి నూనె పోసి తమ కష్టాలు తొలగిపోవాలని కోరుతూ పాడి పంటలు, పిల్ల జెల్లా సల్లంగా ఉండాలని శ్రీ ఆంజనేయస్వామి ఎదుట టెంకాయ కొట్టి వేడుకున్నారు.అనంతరం మాఘ అమావాస్య సందర్భంగా పాల్గొన్న భక్తకోటికి తీర్థ ప్రసాదాలు పులిహోర , సీరాప్రసాదం వితరణ చేశారు.
అదేవిధంగా గొల్లపల్లిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం గాళం గుట్ట వద్ద నిర్వాహకులు పాల్గొన్న భక్తకోటీకి తీర్థ ప్రసాదాలను అన్నప్రసాదం వితరణ చేశారు.అక్కపెళ్లి శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయంలో మాఘ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పాల్గొన్న భక్తకోటికి తీర్థప్రసాదం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.