ప్రభుత్వం మారగానే పత్తాలేకుండా పోయారు

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా అండర్ డ్రైనేజీ,సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అండర్ డ్రైనేజీ పనులు నత్తనడకన సాగడంతో జనరల్ ఎలక్షన్స్ కోడ్ ముగిసినా సీసీ రోడ్డు పూర్తిచేయలేదు.

 When The Government Changed They Disappeared, Government Changed , Cc Road Cons-TeluguStop.com

నియోజకవర్గంలో ఎన్నికల అనంతరం కూడా గత ప్రభుత్వం హామీ ఇచ్చిన సిసి రోడ్లు నిర్మాణాలు అంతట జరిగాయి.కొన్ని కొన్నిచోట్ల శంకుస్థాపనలు చేసి వదిలేశారు.

అండర్ డ్రైనేజ్ నిర్మాణం పనుల కోసం వేగవంతంగా పనులు జరగలేకపోవడం వలన ఆ కాలనీలో శంకుస్థాపన జరిగిన సీసీ రోడ్డుని మరిచారని ఆరోపణలు వస్తున్నాయి.ఎన్నో ఏళ్ల తర్వాత మా కాలనికి సీసీ వస్తుందని ఆశపడ్డ కాలనీ వాసులకు నిరాశే మిగిలింది.

శంకుస్థాపన జరిగిన పనులు ఎందుకు నిలిపివేశారని అడిగితే ప్రభుత్వం మారింది ఏమీ చేయలేమని అంటున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి నిలిచిపోయిన సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

ఎన్నో ఏండ్ల నుండి ఎదురుచూస్తున్న రోడ్డు పడకపోవడం విడ్డూరంగా ఉంది.ప్రభుత్వాలు మారితే పనులు ఆపేస్తారా?అని కాలనీ యువకుడు గంజి ఉమాకాంత్ నేత ప్రశ్నించారు.పాలకులు మారినా మా కాలనీ మాత్రం మారడం లేదని, ఉప ఎన్నిక పేరుమీద అండర్ డ్రైనేజీ వేసి సీసీ వేద్దామనేసరికి ప్రభుత్వం మారిందని చెబుతున్నారని,మోరీల సమస్య తీరిందనుకున్న సమయంలోనే సిసి సమస్య ఏర్పడిందని, కనీసం ఈ ప్రభుత్వమైనా మా కాలనీలో సిసి రోడ్డు వేయాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube