Ram Charan , Upasana: ఆ వ్యక్తి బయోపిక్ తీస్తానని చెప్పిన ఉపాసన.. రామ్ చరణ్ నటించే ఛాన్స్ ఉందా?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) భార్య మెగా కోడలు ఉపాసన( upasana ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకవైపు మెగా కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరొకవైపు అపోలో హాస్పిటల్స్ చైర్మన్ గా కూడా బాధ్యతలను నిర్వర్తిస్తోంది ఉపాసన.

 Upasana Launched The Apollo Story Book On Her Grand Father Dr Prathap C Reddy 9-TeluguStop.com

ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక విషయంలో ఉపాసన పేరు సోషల్ మీడియాలో మారుమగుతూనే ఉంది.సామాజిక సేవా కార్యక్రమాలతో సోషల్ మీడియాలో ట్వీట్లు చేసే విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఉపాసన.

ఇది ఇలా ఉంటే తాజాగా ఉపాసన ఒక ఒక వ్యక్తి బయోపిక్ ఇస్తానని తెలిపింది.

ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.ఉపాసన తాతయ్య డా.ప్రతాప్ చంద్రా రెడ్డి ( Dr.Pratap Chandra Reddy )గురించి అందరికి తెలిసిందే.అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ గా దేశ విదేశాల్లో అపోలో సేవలని విస్తరించి హెల్త్ కేర్ రంగంలో అరుదైన ఖ్యాతి గడించారు.

ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.ఉపాసన తన స్ఫూర్తి తాతయ్య అని చాలా సార్లు చెప్పింది.

ఉపాసన కూడా ప్రస్తుతం అపోలో భాద్యతలు చూసుకుంటుంది.తాజాగా నిన్న ఉపాసన తాతయ్య 91వ పుట్టిన రోజు సందర్భంగా ది అపోలో స్టోరీ అనే పుస్తకాన్ని లాంచ్ చేశారు.

ప్రతాప్ రెడ్డి, అపోలో హాస్పిటల్స్ చరిత్ర, అవి ఎదిగిన విధానం, ఎదుర్కున్న సవాళ్లు ఇలా అనేక అంశాలతో రాసిన పుస్తకం ది అపోలో స్టోరీ.

తాజాగా ప్రతాప్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో ఈ పుస్తకాన్ని లాంచ్ చేశారు.అనంతరం ఉపాసన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన తాతయ్య గురించి, అపోలో గురించి, తన తాతయ్య తన కూతుళ్లలో ఎలా స్ఫూర్తి నింపారు అని మాట్లాడింది.ఈ పుస్తకాన్ని ప్రతి తండ్రి చదవాలని, ఈ బుక్ చదివి ప్రతి మహిళ స్ఫూర్తి పొందాలని ఆమె అన్నారు.

ఈ ప్రెస్ మీట్ లో పుస్తకం తీసుకొచ్చారు, బయోపిక్ ఏమైనా చేసే ఆలోచన ఉందా అని రిపోర్టర్ అడగ్గా.అవును, భవిష్యత్తులో అది జరగవచ్చు అని తెలిపింది.

రామ్ చరణ్ అందులో నటిస్తాడా అని అడగ్గా.అది డైరెక్టర్ విజన్ బట్టి ఉంటుందని ఆమె తెలిపింది.

దీంతో ఉపాసన తాతయ్య, అపోలో ఫౌండర్ డా.ప్రతాప్ చంద్ర రెడ్డి బయోపిక్ కూడా భవిష్యత్తులో రాబోతుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube