ఈ మధ్యకాలంలో చాలామంది బరువుకు సంబంధించి ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు.అయితే యాక్టివ్ గా ఉండాలంటే ఎక్ససైజ్ చేయాలి.
కానీ టీవీ చూస్తూ బిజీగా ఉంటారు.పని చేయాలని ఉన్న కూడా బద్దకంతో చేయలేకపోతారు.
అయితే టీవీ చూస్తూనే కొన్ని పుషప్స్ చేయాలి.ఇక బ్రష్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని గుంజీలు తీయాలి.
లంచ్ డిన్నర్ తర్వాత కనీసం ఒక 20 నుండి 30 నిమిషాల వరకు పాటలు వింటూ నడవాలి.మన జీవక్రియకు తోడ్పడే లవంగం, దాల్చిన చెక్క, పసుపు, ఎర్ర మిరియాలు, అల్లం లాంటి పదార్థాలు రోజు మీ డైట్ లో ఉండేలా చూసుకోవాలి.
ఎందుకంటే లవంగం, దాల్చిన చెక్క రక్తంలో చక్కెరని తగ్గిస్తాయి.అల్లం చర్మకాంతికి దోహదం చేయడంతో పాటు ఆహారం సంపూర్ణంగా జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది.

ఇక ఎర్ర మిరియాలు( Red pepper ) రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి.ఇక నీళ్ల రుచి ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది.చల్లని నీళ్లు తాగడం వలన ఎలాంటి ఇబ్బంది లేని వారు చల్లని నీళ్ళు తాగడం మంచిది.చల్లని నీళ్లు ( Cold Water )తాగడం వలన శరీరంలోని కొన్ని క్యాలరీలు ఖర్చవుతాయి.
ఈ పని చేయడం అంత కష్టమైనదేమీ కాదు.ఒక గ్లాసు చల్లని నీళ్లు తాగితే 10 నుండి 15 క్యాలరీలు ఖర్చవుతాయి.
ఇక లంచ్ తర్వాత కొద్దిసేపు ఎండలో నడవాలి.ఇలా రోజు చేయడం వలన రక్తనాళాల పనితీరు మెరుగవుతుంది.
తక్కువ పదార్థాలు ఎక్కువ సేపు తినడం వలన మీరు ఈజీగా బరువు తగ్గవచ్చు.

అయితే ఒకటే పదార్థాన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని వాటిని చిన్న ప్లేట్లలో పెట్టుకొని తినాలి.ఈ విధంగా కడుపు నిండే అనుభూతి ఉంటుంది.దీంతో ఎక్కువగా తినకుండా ఉంటారు.
అయితే కొన్ని ఆహార పదార్థాల్ని దూరంగా ఉంటేనే బరువు తగ్గడం సాధ్యమవుతుంది.బయట దొరికే జంక్ ఫుడ్, చాక్లెట్ల( Junk food, chocolates )కు దూరంగా ఉంటేనే బరువు తగ్గడం ఈజీ అవుతుంది.
అయితే శరీరానికి 500 క్యాలరీలు చాలా అవసరం ఉంటుంది.దీంతో పాటు వారానికి ఒక రోజు జీర్ణాశయానికి విశ్రాంతి కూడా కావాలని న్యూట్రిషన్స్ చెబుతున్నారు.
కాబట్టి దీనికి తగ్గట్టుగా డైట్ ని ప్లాన్ చేసుకోవాలి.