Cat : పియానోపై భయానక మ్యూజిక్ ప్లే చేసిన పిల్లి.. వీడియో వైరల్..

కుక్కల తర్వాత మనుషులు ఎక్కువగా పెంచుకునేది పిల్లులే అని చెప్పుకోవచ్చు.క్యాట్స్ చాలా స్మార్ట్ యానిమల్స్.

 The Cat Played Scary Music On The Piano Video Viral-TeluguStop.com

కుక్కలు ప్రొటెక్షన్ అందిస్తే పిల్లులు ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తాయి.అందుకే కొందరు ఈ రెండు పెంపుడు జంతువులను పెంచుకుంటారు.

పిల్లులు కొన్ని సందర్భాలలో వాటి చేష్టలతో సర్‌ప్రైజ్ చేస్తుంటాయి.మరికొన్ని సార్లు హడల్ పుట్టిస్తాయి.

తాజాగా ఓ పిల్లి( Cat ) పియానోపై భయానక మ్యూజిక్ ప్లే చేసి యజమానికి వణుకు పుట్టింది.పియానోపైకి ఈ పిల్లి ఎక్కి తన ముందు కాళ్లతో కీబోర్డు నోట్స్ ను ప్లే చేస్తూ ఉంది.

ఆ సౌండ్ ఒక హారర్ సీన్ లేదా మర్డర్ సీన్ కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా యాడ్ చేయవచ్చు.అంత భయానకంగా ఉందా సౌండ్.దాన్ని వింటుంటేనే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి.ఇంట్లో సడన్ గా ఇలాంటి సౌండ్స్ వాటంతటవే వినిపిస్తే ఎవరికైనా సరే చెమటలు పట్టాల్సిందే.ఈ క్యాట్ ఓనర్‌ కూడా చాలా భయపడ్డాడు.తర్వాత ధైర్యం చేసి వెళితే పిల్లి పియానో( Piano ) ప్లే చేస్తూ కనిపించింది.

ఆ దృశ్యాలను ఓనర్ తన కెమెరాలో బంధించారు.దానిని ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీ పూబిటీ షేర్ చేసింది.

షేర్ చేసిన టైమ్ నుంచి ఈ క్లిప్ కు లక్షల్లో వ్యూస్ వచ్చాయి, 40 వేల దాక లైక్స్ వచ్చాయి.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ క్యాట్ సూపర్ టాలెంటెడ్ అని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.“ఈ క్యాట్ అనుకోకుండా ఒక మాస్టర్ పీస్ క్రియేట్ చేసింద”ని ఒక యూజర్ సరదా వ్యాఖ్య చేశారు.ఈ సౌండ్ స్పాటిఫైలో అప్‌లోడ్ చేస్తే లూప్ లో వింటామని కొందరు అన్నారు.

ఆ పిల్లలో ఏదైనా ఆత్మ జొరబడిందేమో, అదే ఈ భయంకర మ్యూజిక్ ప్లే ( music )చేస్తుందేమో అని ఇంకొకరు కామెంట్ పెట్టారు.ఈ వీడియోను మీరు చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube