తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఇండస్ట్రీ లో వాళ్ల కంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటారు.
ఇక ఇలాంటి దర్శకులలో శ్రీకాంత్ ఓదెల ఒకరు.ప్రస్తుతం ఆయన నాని( Nani ) ని హీరోగా పెట్టీ మరొక సినిమాని కూడా ప్లాన్ చేస్తున్నాడు.
ఇక ఇంతకుముందు నాని ని హీరోగా పెట్టి చేసిన దసరా సినిమా( Dasara ) సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడం తో మళ్లీ నానినే తనకి మరొక అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో తనని తాను ప్రూవ్ చేసుకుంటేనే తను స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు అయితే వస్తాయి.
ఇక ఇలాంటి క్రమంలో నాని కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ లను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు.ఇక ఇప్పటికే బలగం వేణు డైరెక్షన్ లో కూడా ఒక సినిమాకి కమిట్ అయ్యాడు.ఇక ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) తో మరొక సినిమా చేస్తున్నాడు.మరి ఇలాంటి క్రమంలో నాని ఎంచుకుంటున్న స్క్రిప్ట్ లు చాలా బాగుంటాయి.
ఇక ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల నాని ని మాస్ యాంగిల్ లో చూపించాడు ఇక ఇప్పుడు ఎలాంటి యాంగిల్ లో చూపిస్తాడు అనేది కూడా కీలకంగా మారనుంది.
అయితే ఇప్పటికే నానికి సరిపడే ఒక స్క్రిప్ట్ ను చెప్పి ఆయన్ని ఒప్పించాడు.ఇక దాంతో ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది క్లారిటీ గా తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమా తో నాని కి సూపర్ సక్సెస్ ను అందిస్తే వరుసగా నాని కి రెండు సక్సెస్ లు అందించిన డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపు పొందుతాడు…
.