రాజన్న సిరిసిల్ల జిల్లా :75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా పోలీస్ కార్యాలయంలో, జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేసి , జిల్లా ప్రజలకు, జిల్లా పోలీస్ అధికారులకు,సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.ఎందరో త్యాగధనుల ఫలితమే నేడు దేశ ప్రజలంతా స్వేచ్ఛా వాయువులను ఆస్వాదిస్తూ 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని,కావున వారిని ఎప్పుడూ మనం స్మరించుకోవాలని,వారి త్యాగ ఫలం ద్వారా మనం ఈరోజు ఎంతో స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నామని,వారి ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ప్రజలకు రాజ్యాంగం కల్పించిన చట్టం ప్రకారం పారదర్శకతతో ధనిక,పేద అనే తేడా లేకుండా విధులు నిర్వర్తించాలని, అందరినీ సమానంగా చూసి సమన్వయం అందించి ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని అధికారులకు, సిబ్బందికి తెలిపారు.జిల్లా పోలీస్ అధికారులు,సిబ్బంది అందరూ కూడ బాగా పని చేస్తున్నారని అభినందించారు.
తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యంత ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్న పోలీసు వ్యవస్థగా మంచి గుర్తింపు సాధించడం జరిగిందని,దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ సాంకేతికతను అలవర్చుకోవాలని తెలిపారు.అనంతరం సేవపథకాలు పొందిన పోలీస్ అధికారులను, సిబ్బంది ని అభినందించి వారికి సేవపథకాలు అందించారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు ,ఆర్.ఐ లు,సి.
ఐ లు,ఎస్.ఐ లు జిల్లా పోలీస్ కార్యాలయాల సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
.