టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి సమంత(Samantha) మయోసైటిస్ వ్యాధిబారిన పడటంతో సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు.సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి ఈమె ఈ వ్యాధి కారణంగా చికిత్స తీసుకోవడం కోసం కొంతకాలం పాటు సినిమాలకు విరామం ప్రకటించారు.
సినిమా ఇండస్ట్రీకి ఈమె దూరంగా ఉన్నప్పటికీ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తున్నారు.ఇకపోతే తాజాగా ఈమె సంక్రాంతి (Sankranthi) వేడుకలను ఘనంగా జరుపుకున్నారని తెలుస్తోంది.
ఈ సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.తాను ఈ సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నానని సమంత వెల్లడించారు.సంక్రాంతి పండుగకు ఈమె చిన్న చిన్న ముగ్గులు వేసి అందమైన పువ్వులతో దానిని అలంకరించారట.అదే విధంగా పాత పద్ధతిలో తలంటూ స్నానం చేసి అనంతరం గాలిపటం ఎగరేసానని తెలిపారు.
అయితే ఆ గాలిపటం( Kite ) తప్పిపోయిందని సమంత వెల్లడించారు.
భోగి పండుగ( Bhogi ) రోజు కూడా ఈమె తన ఇంట్లో ఉన్న పాత వస్తువులని, బ్యాడ్ గా ఉన్న వస్తువులని భోగి మంటల్లో వేసి తగలబెట్టాను అంటూ సంక్రాంతి పండుగకు సంబంధించిన విషయాలను ఈమె అభిమానులతో పంచుకున్నారు.ఈ పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉండగా ఇంట్లో అసలైన యుద్ధం మొదలైందని తన పెట్స్ అయిన పిల్లి కుక్క మధ్య ఇల్లు ఎవరిది అనే విషయంలో గొడవ జరిగిందట.కానీ చివరకి పిల్లే గెలిచినట్లు సమంత సరదాగా పేర్కొంది.
ఇలా సంక్రాంతి విషయాలన్నింటినీ అభిమానులతో పంచుకోవడమే కాకుండా అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.