సంక్రాంతి కానుకగా ఏపీ నిరుద్యోగులకు మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) కీలక ప్రకటన చేశారు.సంక్రాంతి తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు.
పోస్టుల వివరాలు త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.డీఎస్సీ నోటిఫికేషన్( DSC Notification ) గురించి ఇప్పటికే ముఖ్యమంత్రితో చర్చించినట్లు కూడా తెలియజేయడం జరిగింది.
గత సెప్టెంబర్ లో మంత్రి బొత్స సత్యనారాణయ టీచర్ పోస్టులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.ఖాళీగా ఉన్న ఎనిమిది వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు.
ఈ విషయంలో తాము కట్టుబడి ఉన్నామనీ అన్నారు.దీంతో తాజా ప్రకటనతో DSC నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం( Andhra Pradesh )లో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఎప్పటినుండో డీఎస్సీ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తుంది.ఈ మేరకు ఏపీపీఎస్సీ నుంచి త్వరలో నోటిఫికేషన్ లు విడుదలవుతాయని తాజా ప్రకటనతో నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని కూడా తెలిపింది.
కానీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మొత్తం తారు మారయ్యింది.దీంతో సరిగా ఎన్నికలకు ముందు డీఎస్సీ నోటిఫికేషన్ త్వరితగితన విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.