ఒకే ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించింది త్రిప్తి డిమ్రీ(Tripti Dimri).అయితే యానిమల్ సినిమా కంటే ముందే మరికొన్ని సినిమాల్లో ఈ హీరోయిన్ నటించినప్పటికీ ఈ సినిమాకి వచ్చినంత గుర్తింపు ఏ సినిమాకి రాలేదు.
మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే త్రిప్తి డిమ్రీ ఫేమస్ అయ్యిందంటే దానికి ప్రధాన కారణం యానిమల్ మూవీ (Animal Movie) అని చెప్పుకోవచ్చు.అయితే ఈ సినిమాలో త్రిప్తి డిమ్రీ హద్దులు మీరిన రొమాన్స్ చేయడంతో పాటు బోల్డ్ గా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఇక తాజాగా రనబీర్ తో కలిసి త్రిప్తి అర్ధనాగ్నంగా నటించిన ఫుల్ పాట కూడా యూట్యూబ్లో విడుదలైంది.ప్రస్తుతం ఎంతోమంది కుర్ర కారు వీరిద్దరి మధ్య ఉన్న రొమాన్స్ చూడటానికి వెతికి మరీ ఈ వీడియో చూస్తున్నారట.
అయితే ఎప్పుడైతే త్రిప్తి డిమ్రీ పేరు ఎప్పుడైతే నెట్టింట్లో వైరల్ గా మారిందో అప్పటినుండి ఆమె ఎవరు…ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి.అంతకుముందు ఏం చేసింది.ఎన్ని సినిమాల్లో నటించింది అంటూ ఆమె విషయాలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించారు నెటిజన్స్.ఇక త్రిప్తి డిమ్రీ పేరు వైరల్ అయ్యాక ఆమె బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ (Anushka Sharma) తమ్ముడు కర్నేష్ శర్మతో చాలా రోజులు ప్రేమలో ఉందని,వీరిద్దరూ కొద్దిరోజులు రిలేషన్ లో ఉన్నాక మనస్పర్ధల కారణంగా బ్రేకప్ చెప్పుకున్నారు అంటూ కొన్ని వార్తలు వినిపించాయి.

ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం త్రిప్తి డిమ్రీ అనుష్క శర్మ తమ్ముడు కర్నేష్ శర్మ (Karnesh Sharma) తో దిగిన ఫోటోలు చక్కర్లు కొట్టడమే.త్రిప్తి డిమ్రీ కర్నేష్ శర్మతో కాదు ఆ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.ఇక వ్యాపార వేత్త ఎవరో కాదు సామ్ మర్చంట్. వ్యాపారవేత్తగా ఎంతో మంచి గుర్తింపు సాధించిన సామ్ మర్చంట్ తో త్రిప్తి డిమ్రీ ప్రేమలో ఉంది అని, వీరిద్దరూ డేటిం చేస్తున్నట్టు నెట్టింట్లో వైరల్ అయ్యే ఫొటోస్ ని బట్టి అందరూ క్లారిటీకి వచ్చారు.

అయితే ఈ ఫోటోలపై త్రిప్తి డిమ్రీకి సంబంధించిన సన్నిహితులు ఆమె ఎవరితో డేటిం చేయడం లేదని,సామ్ మర్చంట్ (Sam Merchant) తో ఆమె దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తే ఆమెతో డేటిం** చేస్తున్నట్లేనా.ఇందులో ఎలాంటి నిజం లేదు అని కొట్టి పారేశారు.అంతేకాదు ఆమె ఇప్పటికి కూడా సింగిల్ గానే ఉంది అని క్లారిటీ ఇచ్చారు.కానీ ఈ విషయం తెలిసిన కొంత మంది నెటిజన్స్ మాత్రం ఏమో భవిష్యత్తులో ఆయనతో రిలేషన్ లో ఉంటుంది కావచ్చు ఎవరికి తెలుసు అంటూ కామెంట్లు పెడుతున్నారు.