ప్రస్తుత కాలంలో దేశంలో చాలామంది నిరుద్యోగులు సరైన ఉద్యోగం దొరకక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇలాంటి సమయంలో రూ.18 లక్షల జీతంతో ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగాన్ని ఎవరూ సులువుగా వదులుకోరు.అయితే ఒక వ్యక్తి మాత్రం సివిల్స్( Civils ) సాధించాలనే ఆలోచనతో 18 లక్షల వేతనం వచ్చే ఉద్యోగాన్ని వదులుకున్నాడు సమాజానికి, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రిత్విక్( Rithwik ) అనే వ్యక్తి లక్షల వేతనం వచ్చే జాబ్ ను వదులుకున్నారు.
మూడుసార్లు ప్రిలిమ్స్ కే పరిమితమైన రిత్విక్ ఐదో ప్రయత్నంలో ఐపీఎస్( IPS ) సాధించి 558వ ర్యాంకుతో సత్తా చాటారు.హన్మకొండలోని రాంనగర్ కు చెందిన రిత్విక్ సాయి తల్లి మంజుల ఫ్యామిలీ కౌన్సిలర్ కాగా తండ్రి గురుకుల కళాశాలలో లైబ్రేరియన్ గా పని చేస్తున్నారు.
గురుకుల పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన రిత్విక్ కొంపల్లిలోని పేజ్ అకాడమీలో ఇంటర్ చదివారు.ఢిల్లీలోని శివనాడార్ యూనివర్సిటీలో రిత్విక్ బీటెక్ పూర్తి చేశారు.

బీటెక్ పూర్తైన తర్వాత నెలకు లక్షన్నర నేతనంతో రిత్విక్ కు ప్రముఖ కంపెనీలో జాబ్ వచ్చింది.అయితే సివిల్స్ పై ఉన్న ఆసక్తితో ఉద్యోగంలో చేరలేదు.ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లో సివిల్స్ కోచింగ్( Civils Coaching ) తీసుకున్న రిత్విక్ పట్టుదలకు లక్ కూడా కలిసివచ్చి కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం గమనార్హం.రిత్విక్ కు మంచి ర్యాంక్ రావడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఐదేళ్లు పండుగలు, శుభకార్యాలకు దూరంగా ఉండి రిత్విక్ లక్ష్యాన్ని సాధించాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.రిత్విక్ సక్సెస్ స్టోరీ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.రిత్విక్ ఐదేళ్ల కష్టానికి ఫలితం దక్కిందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రిత్విక్ తన ఉద్యోగం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించి మరింత ఎత్తుకు ఎదగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.