ఓట్స్ ఎవరెవరు తినకూడదు.. వారికి ఎందుకు డేంజర్?

ఓట్స్( Oats ).వీటి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.

 Do You Know Who Should Not Eat Oats? Oats, Oats Health Benefits, Oats Side Effec-TeluguStop.com

ఇటీవల కాలంలో ఓట్స్ వినియోగం భారీగా పెరిగింది.ఓట్స్ తో ఉప్మా, ఇడ్లీ, దోశ, స్మూతీ ఇలా రకరకాల వంటలు తయారు చేసుకుని తింటున్నారు.

ముఖ్యంగా బరువు తగ్గాలని భావించేవారు తప్పకుండా డైట్ లో ఓట్స్ ఉండేలా చూసుకుంటున్నారు.ఎందుకంటే, వెయిట్ లాస్ కు ఓట్స్ చక్కగా తోడ్పడతాయి.

అదే సమయంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి.అయితే ఓట్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ.

కొందరు మాత్రం వాటిని తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మరి ఇంతకీ ఆ కొందరు ఎవరు.? వారికి ఎందుకు ఓట్స్ డేంజర్.? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఓట్స్ ను ఎవైడ్ చేయడమే మంచిది.ఎందుకంటే ఓట్స్ లో ఫాస్పరస్ ఉంటుంది.ఇది కిడ్నీ వ్యాధుల‌ను మరింత అధికం చేస్తుంది.

Telugu Tips, Latest, Oats, Oats Benefits, Oats Recipes, Oats Effects-Telugu Heal

అలాగే కొందరికి ఓట్స్ తిన్న ప్రతిసారి కడుపు ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు( Digestive problems ) తలెత్తుతుంటాయి.అలాంటి వారు కూడా ఓట్స్ ను తినకపోవడం ఉత్తమం.మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వారు ఓట్స్ ను చాలా అంటే చాలా మితంగా తీసుకోవాలి.

ఎందుకంటే ఓట్స్ లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.ఇవి షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ తప్పేలా చేస్తాయి.

అందుకే మధుమేహం ఉన్న వారు ఓట్స్ ను త‌క్కువ‌గా తీసుకోలేదు.లేదా దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Telugu Tips, Latest, Oats, Oats Benefits, Oats Recipes, Oats Effects-Telugu Heal

ఇక మిగతా వారు మాత్రం ఓట్స్ ను ఎలాంటి భ‌యం లేకుండా రెగ్యులర్ గా తీసుకోవచ్చు.ఓట్స్ గుండె సంబంధిత జబ్బులకు అడ్డుకట్ట వేస్తుంది.అది ఆకలిని దూరం చేసే శరీరాన్ని ఎక్కువ సమయం పాటు శక్తివంతంగా ఉంచుతుంది. రక్తపోటు అదుపులో ఉండేలా చూస్తుంది.మరియు వేగంగా బరువు తగ్గడానికి సైతం గ్రేట్ గా సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube