ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ నేతలపై కుట్రపూరితంగా బీఆర్ఎస్, బీజేపీ దాడులు చేయిస్తున్నాయని ఆరోపించారు.
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అర్ధం అవుతుందన్న ఆయన ప్రాజెక్టు కుంగడంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.