13వేల అడుగుల ఎత్తులో అతి పొడవైన టన్నెల్ నిర్మాణం షురూ.. ఎక్కడంటే?

13వేల అడుగుల ఎత్తులో పొడవైన టన్నెల్ ఏమిటని ఆశ్చర్యపోవద్దు.మీరు విన్నది నిజమే.

 The Construction Of The Longest Tunnel At A Height Of 13 Thousand Feet Where, T-TeluguStop.com

కేంద్ర ప్రభుత్వం సరిహద్దుల్లో భద్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తోన్న విషయం తెలిసినదే.మరీ ముఖ్యంగా ఇండో-చైనా బోర్డర్‌లో సైనిక, రవాణా వసతులను శరవేగంగా మెరుగు పరుస్తోంది.

ఈ క్రమంలో సరిహద్దు వెంబడి సైన్యం సునాయాసంగా కదిలేందుకు వీలుగా రోడ్లను నిర్మించడం విశేషం.పలు ప్రాంతాల్లో ఎయిర్ ఫెసిలిటీలు, కమ్యూనికేషన్ వ్యవస్థను( Air facilities, communication system ) బలపరుస్తోంది.

ఇదిలా ఉంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 13,000 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అతిపొడవైన బై-లైన్ సెలా టన్నెల్ మార్గాన్ని పూర్తి చేస్తోంది.

Telugu Thousand Feet, Longest Tunnel-Latest News - Telugu

ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi ) 2019లో సెలా టన్నెల్( Selah Tunnel ) కి శంకుస్థాపన చేసిన విషయాన్ని మీరు వినే వుంటారు.ఇండో-చైనా బోర్డర్లోని తూర్పు సెక్టార్ వైపు మెరుగైన కనెక్టివిటీ కోసం అరుణాచల్ రాష్ట్రంలో వ్యూహాత్మకంగా భారత్ ఈ సెలా సొరంగాన్ని నిర్మించడం గమనార్హం.బి‌ఆర్‌ఓ (బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్) నిర్మిస్తున్న ఈ టన్నెల్‌ని యుద్ధ ప్రాతిపదికన నిర్మించబడుతోంది.

ప్రస్తుతం సెలా టన్నెల్ పనులు చివరి దశలో వున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈ ఏడాదిలోగా టన్నెల్ అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

Telugu Thousand Feet, Longest Tunnel-Latest News - Telugu

ఈ సొరంగం తవాంగ్ ప్రజలకు అన్ని వాతావరణ పరిస్థితుల్లో మంచి రవాణా సౌకర్యాలను అందిస్తుందని భావిస్తున్నారు.కాగా ఈ టన్నెల్ నిర్మాణానికి సంబంధించి 90 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.ఇకపోతే ఈ సెలా టన్నెల్ ప్రాజెక్టు 2 సొరంగాలను కలిగి ఉంది.టన్నెల్-1 పొడవు 980 మీటర్లు కలిగిన సింగిల్ ట్యూబ్ టన్నెల్ కాగా.టన్నెల్-2, 1555 మీటర్ల పొడవైన ట్విన్ ట్యూబ్ టన్నెల్.సెలా టన్నెల్ సెలా పాస్ నుంచి 400 మీటర్ల దిగువన ఉంది.

శీతాకాలంలో విపరీతమైన మంచు కురిసే సందర్భాల్లో కూడా ఈ టన్నెల్ గుండా ప్రయాణాలు కొనసాగించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube