బాహుబలి సినిమాలో జక్కన్న ఫేవరెట్ రోల్ ఇదే.. ఆ పాత్ర అంటే ఇంత ఇష్టమా?

టాలీవుడ్ దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా దూసుకుపోతున్నారు రాజమౌళి.

 This Is Rajamouli's Favorite Role In Baahubali, Bhahubali, Rajamouli, Favorite R-TeluguStop.com

కాగా ఇప్పటివరకు ఆయన 12 సినిమాలు తెరకెక్కించగా ఆ సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన విషయం తెలిసిందే.అంతేకాకుండా ఒకదాన్ని మించి ఒకటి రికార్డుల మోత మోగించాయి.

అలాగే తెలుగు చిత్ర పరిశ్రమను హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత జక్కన్నదే అని చెప్పాలి.రాజమౌళి( Rajamouli ) దర్శకత్వం వహించిన సినిమాలో బాహుబలి సినిమా కూడా ఒకటి.

Telugu Anushka, Bhahubali, Devasena, Favorite Role, Rajamouli, Tollywood-Movie

ఈ సినిమా ఆయన క్రేజ్ ని పెంచడంతో పాటు తెలుగు సినిమా ఖ్యాతిని పాన్ ఇండియా లెవెల్ లో చాటి చెప్పింది.రెండు భాగాలుగా వచ్చిన ఈ మూవీ కోసం రాజమౌళి నిర్మాతల చేత ఏకంగా నాలుగు వందల కోట్లు ఖర్చుతో ఈ సినిమాను నిర్మించారు.ఆ సంగతి అటు ఉంచితే మొదట ఈ సినిమాను తెరకెక్కించడానికి రాజమౌళి కాస్త వెనుకడుగు వేశారట.ఆ సమయంలో ప్రభాస్ రాజమౌళికి అండగా నిలిచారట.కాగా బాహుబలి సినిమాలో ఎన్నో పాత్రలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.

Telugu Anushka, Bhahubali, Devasena, Favorite Role, Rajamouli, Tollywood-Movie

వీటన్నింటిలో దేవసేన పాత్ర ( Devasena )అంటే రాజమౌళికి ఎంతో ఇష్టమట.ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పకొచ్చారు దర్శకుడు రాజమౌళి.ఇకపోతే జక్కన్న సినిమాల విషయానికి వస్తే.

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాతో తెలుగు సినిమాకియా అనే మరింత పెంచుతాడని, తప్పకుండా ఆ సినిమా సంచలన విజయం సాధిస్తుందని మహేష్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube